22.9 C
Hyderabad
Tuesday, November 3, 2026

Live Video

spot_img

రంజీల్లోనూ మారని సీన్

సొంత గడ్డపై న్యూజిలాండ్ సిరీస్.. ఆసీస్ గడ్డపై BGT సిరీస్ చేజారిన తర్వాత బీసీసీఐ చేసిన దిద్దుబాటు చర్య ఏటంటే సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు దేశవాళీ మ్యాచ్‌లు ఆడాల్సిందే.. తమ ఆట తీరును మెరుగుపరుచుకోవాల్సిందే అని. దీంతో రంజీ మ్యాచ్‌ల మొఖం కూడా చూడని చాలా మంది ప్లేయర్లు ఇప్పుడు రంగంలోకి దిగారు బ్యాట్ పట్టారు. కానీ ఏమైనా మార్పు కనిపించిందా అంటే శూన్యం. టీమిండియా బ్యాట్స్‌మెన్ చేసిన స్కోర్లు 3,4,4,1.

రోహిత్ శర్మ..
ముంబై తరపున రంజీల్లో రంగంలోకి దిగిన రోహిత్ శర్మ.. జమ్ము కశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా రంగంలోకి దిగాడు. 19 బాల్స్ ఆడిన హిట్‌ మ్యాన్‌ కేవలం మూడంటే మూడు పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో అతని ఫ్లాప్ షో కంటిన్యూ అయ్యిందనే చెప్పాలి. ఉమర్ నజీర్‌ బౌలింగ్ క్యాచ్‌ ఔట్‌ అయి పెవిలియన్‌కు వచ్చేశాడు.

యశస్వి జైశ్వాల్..
ఇదే ముంబై తరపున బరిలోకి దిగాడు జైశ్వాల్. ఈ యువ ప్లేయర్ కూడా రంజీల్లో దారుణంగా ఫెయిలయ్యాడు. కేవలం నాలుగంటే నాలుగే పరుగులు చేసి ఔటయ్యాడు.

శ్రేయస్ అయ్యర్..
ముంబై తరపున ఆడుతున్న శ్రేయస్ అయ్యర్‌ది కూడా సేమ్ సీన్. క్రీజులోకి అడుగు పెట్టగానే సిక్స్‌ బాదేసిన అయ్యర్.. మంచి ఫామ్‌లో ఉన్నాడనుకుంటే.. ఆ తర్వాత ఓ ఫోర్ కొట్టి.. టోటల్‌గా 11 పరుగులకే పెవిలియన్‌కు వెళ్లిపోయాడు.

శుభ్‌మన్ గిల్..
పంజాబ్ తరపున సారథ్యం వహిస్తున్న టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌ కూడా రంజీల్లో ఫెయిలయ్యాడు. పంజాబ్‌ తరపున ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చి కేవలం 4 పరుగులు చేసి ఔటయ్యాడు.

రిషబ్ పంత్..
ఢిల్లీ తరపున బరిలోకి దిగిన రిషబ్ పంత్‌ది కూడా ఫ్లాప్‌ షో అనే చెప్పాలి. ఎప్పుడూ సంచలనాలను నమోదు చేసే ఈ యువ బ్యాటర్.. ఈసారి ఒకే ఒక్క పరుగు చేసి సరికొత్త సంచలనం సృష్టించాడు.

ఇలా ఓవరాల్‌గా చూస్తే రంజీల్లో ఆడుతున్న టీమిండియా ప్లేయర్లంతా తమ చెత్త ప్రదర్శనను కంటిన్యూ చేస్తున్నారు. నిజానికి ఫైనల్‌ టీమ్‌కి కనక రంజీ ఆటనే ఓ కొలమానంగా తీసుకుంటే మాత్రం ఆడటం అటుంచి.. కనీసం సెలెక్ట్ అయ్యే అర్హత కూడా ఉండదని చెప్పాలి.

ఇక కోహ్లీ మాత్రం రంజీ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ నెల 30న రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌లో కోహ్లీ ఆడనున్నాడు. మరి ఈ దిగ్గజం ఏం చేస్తాడో చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com