29 C
Hyderabad
Monday, July 27, 2026

Live Video

spot_img

స్టుపిడ్… స్టుపిడ్… స్టుపిడ్ షాట్

  • ఇది టెస్ట్ మ్యాచ్.. వన్డే, టీ 20 కాదు…
  • ఎంత జాగ్రత్తగా ఆడాలి
  • కామెంటరీ బాక్స్ నుంచి పంత్ పై గవాస్కర్ అరుపులు

భారత్ క్రికెట్ కి దొరికిన యువ కిశోరం ఎవరంటే రిషబ్ పంత్ అని ఎవరన్నా చెబుతారు. ప్రాణాపాయం నుంచి  బయటపడి మరి..మళ్ళీ క్రికెట్ ప్రపంచంలో అడుగుపెట్టాడు. అంతే కాదు… టీ 20 వరల్డ్ కప్ సాధించడంలో తనది కీలకమైన పాత్ర ఉంది. అలాంటి పంత్ ని పట్టుకొని… సునీల్ గవాస్కర్ లాంటి సీనియర్ క్రికెటర్ ఇలా మాట్లాడటం సరికాదని అంటున్నారు.

ఇంతకీ తను ఏమన్నాడంటే… మెలబోర్న్ లో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో టీమ్ ఇండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఎంతో సంయమనంతో ఆడాల్సిన పంత్ ఇలా పనికి మాలిన రాంప్ షాట్స్ కొట్టడం సరి కాదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది స్టుపిడ్ షాట్ అంటూ అభివర్ణించాడు. ఇది టెస్ట్ మ్యాచ్.. వన్డే, టీ 20 కాదు… ఎంత జాగ్రత్తగా ఆడాలి. ఇంత బాధ్యతారాహిత్యంగా ఆడటం.. టెస్ట్ క్రికెట్ లో సూట్ కాదని అన్నాడు… అంతే కాదు… ఇంకో భయంకరమైన మాట అన్నాడు. అతన్ని ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్ లోనికి రానివ్వద్దు… వేరే వాళ్ళ రూమ్ లోకి పంపమని కామెంట్ చేశాడు.

ఏమిటి? ఇండియన్ టీమ్ ఇంత అధ్వానంగా ఆడుతున్నారు..యశస్వి లాంటి వాడు క్రీజ్ లో  నిలదొక్కుకున్న తర్వాత అనవసరంగా రన్ అవుట్ అయ్యాడు. పంత్ చూస్తే ఇలా కింద పడి, అడ్డ దిడ్డంగా ఆడుతున్నాడని మండి పడ్డాడు. ఆడాల్సిన వారిలో లేదు, ఆడేవారిలో లేదు…అని ఓపెన్ గా… అందరికి వినిపించేలా కామెంటరీ బాక్స్ నుంచే మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశగా మారింది.

చాలామంది అనేది ఏమిటంటే…

సునీల్ గవాస్కర్ కూడా ఒకప్పుడు క్రికెట్ ఆడినవాడే. తను ఎన్నోసార్లు జట్టుని కష్టాల్లో పడేసి అవుట్ అయిపోయేవాడు. ఒకసారి 1975 వరల్డ్ కప్ సందర్భంగా ఇంగ్లాండ్ తో జరిగిన వన్ డే మ్యాచ్ లో 176 బాల్స్ లో 36 పరుగులు చేసి, అత్యంత చెత్త బ్యాటింగ్ ఆడిన క్రికెటర్ గా ఇప్పటికి రికార్డు తన పేరునే ఉంది. ఇలాంటివెన్నో ఘటనలు ఉన్నాయి. ఆనాడు జట్టులో రాజకీయాలు చేసి ఇండియన్ క్రికెట్ ని నాశనం చేసిన వాడిలో ఒకడు గవాస్కర్ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు…నువ్వా పంత్ ని అనేదని మండి పడుతున్నారు. మరికొందరు మాత్రం మన క్రికెటర్లు…కంట్రీ ప్రెస్టేజ్ లేకుండా ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com