జనసేనాని, DCM పవన్ కళ్యాణ్ మన్యం పర్యటనలో నకిలీ IPS హల్‌చల్ చేశాడు. పర్యటన ఆసాంతం పవన్ కళ్యాణ్ వెంటే ఉన్న నకిలీ IPS… భద్రతా సిబ్బందితో ఫోటోలకూ ఫోజులిచ్చాడు. ఈ కేటుగాడు వై కేటగిరీ భద్రతలో ఉన్న డిప్యూటీ సీఎం పర్యటనలో పాల్గొనటం సంచలనంగా మారింది. భధ్రతాలోపాలపై హోం మంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణకు ఆదేశించారు.
ఇటీవల సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండల పర్యటనకు పవన్ కళ్యాణ్ రాగా…ఆ సమయంలో ఆయన వెన్నంటే ఉండి ఐ.పి.ఏస్ ఆఫీసర్ లా కలియ తిరిగిన వ్యక్తిని పోలీసు ఉన్నతాధికారులు కనుగొనలేకపోవటం చర్చనీయాంశం అయింది.
పర్యటన అనంతరం కింది స్థాయి సిబ్బందితో ఫోటోలుకు ఫోజులు ఇచ్చిన వ్యక్తి…పర్యటన తర్వాత ఫోటోలు బయటకు రావడంతో మన్యం జిల్లా పోలీసులు విచారిస్తున్నారు. నకిలీ IPS ఆఫీసర్ అని తేలడంతో నిన్న రాత్రి అదుపులోకి విజయనగరం రూరల్ పోలీసులు తీసుకున్నారని సమాచారం.
నకిలీ IPS గరివిడి మండలానికి చెందిన బలివాడ సూర్య ప్రకాష్ అనే వ్యక్తిగా గుర్తించారు. ఘటనపై సీరియస్ అయిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.