24.5 C
Hyderabad
Tuesday, July 28, 2026

Live Video

spot_img

జవహర్ బాబును పరామర్శించిన ఉపముఖ్యమంత్రి

కడప జిల్లాలో ఒక్క రోజు పర్యటనలో భాగంగా శనివారం రోజు కడప లోని రిమ్స్ ఆసుపత్రిలో గాలివీడు ఎంపిడివో ను పరామర్శించేందుకు గన్నవరం విమానాశ్రయం నుండి బయలుదేరి కడప విమానాశ్రయం కు ఉదయం 11.48 గంటలకు చేరుకున్న గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కు అధికారులు, ప్రజాప్రతినిధుల నుండి ఘన స్వాగతం లభించింది.

కడప విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, పీఆర్ కమిషనర్ కృష్ణ తేజ, పి ఎస్ టు డిప్యూటి సి యం మధుసూదన్, కడప ఆర్డీ ఓ జాన్, ఇర్వీన్, కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎమ్మెల్సీ వైస్ ఛైర్మన్ జకీయా ఖానం, సికే దీన్నే తహసీల్దార్ నాగేశ్వర రావు ఇతర అధికారులు, తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు.

అనంతరం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆప్యాయంగా అందరిని పేరుపేరున పలకరించి రిమ్స్ ఆసుపత్రికి ఉదయం 11.52 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు. ఆస్పత్రిలో జవహర్ బాబును పరామర్శించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com