రాబోయే రోజుల్లో తప్పుడు కంటెంట్ నియంత్రించేందుకు యూట్యూబ్ కఠినమైన చర్యలకు ఉపక్రమిస్తోంది. భారతదేశంలో రాజకీయంగా, సామాజికంగా వివిధ ఆంశాలపై యూట్యూబ్ లో వీడియోలు అప్ లోడ్ చేయటం సాధారణమైంది. అయితే వీక్షకులను తప్పుదారి పట్టించే థంబ్ నెయిల్స్ పెడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
దీనిపై యూట్యూబ్ యాజమాన్యానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమైన సందర్భాలలో సమయానుకూలమైన, ఖచ్చితమైన సమాచారాన్ని పొందడానికి ప్రజలు తరచుగా ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడతారని… బ్రేకింగ్ న్యూస్, ప్రస్తుత ఈవెంట్‌లతో కూడిన వీడియోల్లో తప్పులు దోర్లితే తీవ్రంగా మారుతుందని YouTube చెబుతోంది. దీనిని పరిష్కరించడానికి… వీక్షకులకు విశ్వసనీయమైన సమాచారాన్ని అందించడానికి YouTube చర్యలు చేపడుతోంది.
శీర్షికలు లేదా థంబ్‌నెయిల్‌లు తప్పుదారి పట్టించేలా ఉన్న వీడియోలు అప్లోడ్ చేసేవారు ఇకనుంచి జాగ్రత్తగా ఉండాల్సిన అవసర ఉంది. వీడియోల్లో ఖచ్చితత్వం పెంచటమే తమ లక్ష్యమని… అందుకు కఠిన చర్యలు తప్పవని YouTube యాజమాన్యం వివరణ ఇచ్చింది.