32.7 C
Hyderabad
Monday, May 25, 2026

Live Video

spot_img

ఆదేశాలు పట్టించుకోరా? – ఏపీ పోలీసులపై హైకోర్టు మండిపాటు

– బైక్‌పై ఇద్దరికీ హెల్మెట్లు ఉండాల్సిందే
– రోడ్లపై పోలీసులు చలానాలు వసూలు చేయాల్సిందే
– చలాన్లు కట్టనివాళ్లపై చర్యలు తీసుకోవాల్సిందే
– పోలీసులకు ఉన్నత న్యాయస్థానం మరోసారి ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌ పోలీసులపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మండిపడింది. ప్రజల భద్రతపై పట్టింపు లేదా అని ప్రశ్నించింది. తాము ఇచ్చిన ఆదేశాలను ఎందుకు తేలిగ్గా తీసుకుంటున్నారని నిలదీసింది. ఇకపై అలసత్వం వహిస్తే సహించేది లేదని హైకోర్టు స్పష్టం చేసింది.

రోడ్లపై బైక్‌పై ప్రయాణించే వాళ్లకు ఇద్దరికీ హెల్మెట్‌లు తప్పనిసరిగా ఉండాలని ఏపీ హైకోర్టు గుర్తుచేసింది.డ్రైవర్‌తో పాటు.. బైక్‌పై వెనుక కూర్చున్న వాళ్లు కూడా తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాల్సిందే అని స్ప్టం ేసింది. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై న్యాయస్థానం ఆందోన వ్యక్తం ేసింది. హెల్మెట్‌ లేకుండా డ్రైవ్ చేసి జూన్ నుంచి సెప్టెంబరు మధ్య 667 మంది ప్రాణాలు పోగొట్టుకోవడం సామాన్యమైన విషయం కాదని పోలీసులకు తేల్చి చెప్పింది. ఈ విషయంపై హైకోర్టు సీరియస్ అయింది. మోటార్ వాహనాల చట్టం అమలు చేయడంలో వచ్చిన ఇబ్బంది ఏంటని పోలీసులను ప్రశ్నించింది. సీసీ కెమెరాలు చూసి చర్యలు తీసుకునే విధానం తగ్గించి నేరుగా రోడ్లపైనే పోలీసులు నిలబడి చలాన్లు వసూలు చేయాలని సూచించింది. హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేయాలంటూ తాము ఇచ్చిన ఆదేశాలను పోలీసులు ఎందుకు లైట్ తీసుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది. పోలీసులు నేరుగా రోడ్లపై ఉంటే నేరాల సంఖ్య కూడా తగ్గుతుందని అభిప్రాయపడింది. అక్కడే హెల్మెట్‌ ఉందా లేదా చూడటంతో పాటు.. రికార్డుల తనిఖీ కూడా అప్పుడే జరిగిపోతుందని చెప్పింది. రాష్ట్రంలో 99 శాతం మంది హెల్మెట్ లేకుండానే వాహనాలు నడుపుతున్నారని ఇది ఎంత మాత్రం క్షేమం కాదని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వాహనాలు నడిపే వ్యక్తి కాకుండా వెనుకున కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని కోర్టు ఆదేశించింది. అలాంటి చేయని వారిపై మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది.కొందరు సంవత్సరాలుగా చలాన్లు కట్టలేదని వారిపై సెక్షన్ 167, సెక్షన్ 206 ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. వారి వాహనాలను సీజ్ చేసి లైసెన్స్‌ రద్దు చేయాలని ఆదేశించింది. ఒక్క హెల్మెట్ విషయమే కాకుండా ఆటోల్లో కూడా పరిమితికి మించి జనాలను ఎక్కిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడింది కోర్టు. ఇలాంటి చట్ట విరుద్దమైన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది. ప్రచార మాధ్యమాల్లో యాడ్లు, సైన్‌బోర్డుల ద్వారా విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పింది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com