33.2 C
Hyderabad
Tuesday, April 21, 2026

Live Video

spot_img

సహజీవన సమ్మేళనమే నేటి సూత్రం

  • రామాలయం తో సరి.. ఇక ఆ గొడవలొద్దు
  • హిందూ ఐక్యతపై ఆరెస్సెస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు

హిందూ సమాజం సహనంతో ఐక్యంగా జీవించడానికి అడుగులువేయాలని, హిందువులంతా కలసి కట్టుగా అడుగేయాల్సిన అవసరాన్ని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ మరోసారి నొక్కి చెప్పారు. ఆరెస్సెస్ చీఫ్ నుంచి ఇలాంటి ప్రకటన రావడం ఇది రెండో సారి. గతంలో బంగ్లాదేశ్ లో హిందూ మైనారిటీలపై దాడులు జరుగుతుండటం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ హిందూ సమాజం ఐక్యంగా నిలబడాల్సిన అవసరాన్ని తెలియచెప్పారు. అయితే వక్ఫ్ చట్టం సవరణ బిల్లు పార్లమెంటులో పెండింగ్ లో ఉండగా మోహన్ భగవత్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఆ వాదనలు ఇక అనవసరం..

ప్రతీ మసీదు కింద హిందూ ఆలయాలు ఉండి ఉంటాయని ఇప్పుడు తవ్వి తీయడం అనవసరం అంటున్నారు ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్.. మందిర్, మసీదు వివాదాలను ఇక్కడితో ఆపాలని సామరస్యంతో పరమత సహనంతో సమాజం కలసి మెలసి జీవించాలని ఆయన అన్నారు.రామ మందిరంపై చారిత్రక తీర్పు వెలువడిన నేపధ్యంలో కొందరికి ఈ వివాదంతో లబ్ది పొందాలని, పేరు సంపాదించాలనే ఉబలాటం మొదలైందని అలాంటి హిందూ నేతలనుంచే మసీదులనుతవ్వి తీయాలనే వాదనలు, పిటిషన్లు వెల్లువెత్తుతున్నాయని మోహన్ భగవత్ అన్నారు.

సహజీవన సమ్మేళనమే సూత్రం..

పూనేలోని సహజీవన్ వ్యాఖ్యాన మాల అనే ఆధ్యాత్మిక ప్రవచనాల సీరీస్ లో తన ఉపన్యాసం ఇచ్చిన ఆరెస్సెస్ ఛీఫ్ ప్రస్తుత సమాజంలో అందరూ కలసి మెలసి బతకాలని, తద్వారా ప్రపంచానికి సహజీవన సిద్ధాంతాన్ని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. హిందువులలో పరమత సహనం, సమభావన ఎక్కువని పరోక్షంగా ఆయన అన్నారు. అందుకే రామక్రిష్ణా మిషన్ లో సైతం క్రిస్మస్ వేడుకలు జరుపుకోగలుగుతున్నామన్నారు. ఆకలుపు గోలు తత్వం హిందూ సమాజానికి మాత్రమే ఉన్న ఒక అరుదైన లక్షణమని, దానిని మరింత బలపరుస్తూ ముందుకు అడుగులేయాలని మోహన్ భాగవత్ అప్రాయపడ్డారు.

పాకిస్థాన్ పుట్టుకే అది..

అసలు పాకిస్థాన్ ఆవిర్భావమే ఈ విచ్ఛిన్న రాజకీయాల తో జరిగిందన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలన్నది యావత్ హిందువుల విశ్వాసం.అందుకే అది సాధ్యపడింది. అయితే రామ మందిర నిర్మాణం తర్వాత కొత్త వాదనలు, కేసులు పుట్టుకొస్తున్నాయి. హిందువుల నేతగా గుర్తింపు పొందడానికి కొందరు ఇప్పుడు మసీదులను తవ్వి ఆలయాలను పరిరక్షించాలనే వాదనను తీసుకొస్తున్నారు.. ఇది సహజీవన సూత్రంతో ఏర్పడిన భారత్ భవిష్యత్తుకి ఎంత మాత్రం మంచిది కాదు అన్నారు.

వేర్పాటువాదం వారి పుణ్యమే…

స్వాతంత్య్రానికి పూర్వం ఆంగ్లేయుల పాలనలో ఈ వేర్పాటు వాద రాజకీయం (అలగ్ వాద్) మొదలైందని, పాకిస్థాన్ దేశం ఏర్పాటుకూడా అందుకే జరిగిందని , హిందువులు రామాలయంపై పోరాటం చేయల్సి వచ్చిందని మోహన్ భగవత్ అన్నారు. ఇప్పుడు మనదేశంలో రాజ్యాంగం ఆధారంగా ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగుతోందని, కాబట్టి అలాంటి వాదనలు అసంబద్ధమని అన్నారు. ఇటీవల కాలంలో ఆరెస్సెస్ చీఫ్ ఇలాంటి వ్యాఖ్యలుచేయడం రెండో సారి. ఇటీవలే బంగ్లాదేశ్ లో హిందూ మైనారిటీలపై జరిగినదాడుల నేపధ్యంలో హిందూ సమాజం కలసి కట్టుగా ఉండాలని ఆయన పిలుపునివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com