29.4 C
Hyderabad
Tuesday, September 15, 2026

Live Video

spot_img

రేపే ఎస్‌ఎస్‌సీ ఫలితాలు

తెలంగాణలో ఎస్‌ఎస్‌సీ ఫలితాల రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. రేపు పదో తరగతి ఫలితాలు విడుదల చేసేందుకు ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేసింది. రవీంద్రభారతిలో పదో తరగతి పరీక్షల ఫలితాలను రిలీజ్‌ చేయనున్నారు. ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల్లో 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈసారి పదో తరగతి ఫలితాల్లో గ్రేడింగ్‌తో పాటు మార్కులు వెల్లడించనున్నారు. విద్యార్థుల మోమోలలో సబ్జెక్టుల వారీగా గ్రేడింగ్స్‌తో పాటు మార్కులు కూడా ఇవ్వనున్నారు.

ఎస్‌ఎస్‌సీ ఫలితాలు విడుదలైన వెంటనే తెలంగాణ ట్రిపుల్‌ఐటీ నోటిఫికేషన్‌ 2025 కూడా విడుదల కానుంది. 10వ తరగతిలో మంచి మార్కులతో పాసైన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ https://bse.telangana.gov.in/ ద్వారా తమ ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు.

విద్యార్థి దశలో 10వ తరగతి పరీక్షలు భవిష్యత్తుకు ఎంత కీలకమైనవో మనందరికీ తెలిసిందే. కెరీర్‌కు పునాదులు వేసుకునే క్రమంలో పదో తరగతి అనేది ఎంతో కీలకమైంది. అందుకే విద్యార్థులు, తల్లిదండ్రులు టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలంటే ఎంతో శ్రద్ధ చూపెడతారు.ఫలితాల అనంతరం విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు.. అందుకే.. పదో తరగతి ఫలితాలపై ఎప్పుడూ ఉత్కంఠ ఉంటూనే ఉంటుంది. ఈక్రమంలో తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయా అని విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫలితాలు విడుదల తర్వాత ఇంటర్మీడియట్‌, ట్రిపుల్‌ ఐటీ, డిప్లొమా తదితర కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారు.తెలంగాణలో మార్చి 21వ తేదీన ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 2 తో ముగిశాయి. మొత్తం 2,650 కేంద్రాల్లో రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో క్వశ్చన్ పేపర్ లీకేజీ ఘటనలు మినహా పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో.. తెలంగాణ ఎస్‌స్‌సీ బోర్డు ముూల్యాంకనం నిర్వహించి ఆ ప్రక్రియను సైతం విజయవంతంగా ముగించింది. 10th పరీక్షలను నిర్వహించిన ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ ఏప్రిల్ 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 19 శిబిరాల్లో సమాధాన పత్రాల స్పాట్ మూల్యాంకనాన్ని నిర్వహించింది. అనంతరం మరోసారి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా రీచెక్‌ చేసి ఫలితాలు కంప్యూటరీకరణ ప్రక్రియ సైతం పూర్తి చేశారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com