32.2 C
Hyderabad
Thursday, April 23, 2026

Live Video

spot_img

శ్రీవాణి ట్రస్ట్ యే శరణాగతి

  • ట్రస్ట్ పై వ్యతిరేకంగా మాట్లాడిన వారికి ఇప్పుడు అదే దిక్కు
  • అమరావతి బ్రాండింగ్ కి శ్రీవాణి ట్రస్ట్ నిధులే
  • దేశవ్యాప్తంగా ఆలయాల నిర్మాణం కు శ్రీవాణి నిధులే కీలకం

శ్రీవాణి ట్రస్ట్ అంటే శ్రీవారి ఆలయ నిర్మాణం ట్రస్ట్….అని అర్దం. 2018 అక్టోబర్ లో అప్పటి కూటమి ప్రభుత్వం శ్రీవాణి ట్రస్ట్ ని ప్రారంభించినా దానికి విధివిధానాలు రూపొందించింది మాత్రం వైయస్ జగన్ హయంలోనే. శ్రీవాణి ట్రస్ట్ కి పది వేల రూపాయలు విరాళంగా అందిస్తే వారికి ఎటువంటి సిఫార్సు లేఖలు లేకుండా విఐపి ప్రోటోకాల్ దర్శనం టిక్కెట్టు కోనుగోలు చేసుకునే సౌలభ్యం కల్పించింది టిటిడి. దీనితో ట్రస్ట్ కి పది వేల రూపాయలు, దర్శనం టికెట్టుకు 500 రూపాయలు విడివిడిగా భక్తులు చెల్లించాలి. ట్రస్ట్ కి సంబంధించిన నిధులుకు టిటిడికి ఇన్ కంట్యాక్స్ మినహాయింపు వుండగా టిక్కేట్టకు చెల్లీంచే మొత్తానికి మినహాయింపు వుండదు. దినితో రెండిటికి వేర్వేరుగానే నగదు చెల్లింపు భక్తుడు చెయ్యాలి. దినినే అవకాశంగా తీసుకున్న కూటమి నేతలు ఎన్నికలకు ముందు శ్రీవాణి ట్రస్ట్ పై వ్యతిరేక ప్రచారం చేసారు. ట్రస్ట్ నిధులు దారి మళ్ళాయని భక్తుడికి 500 రూపాయలకు సంభందించిన రసీదు మాత్రమే ఇస్తున్నారని అబద్దపు ప్రచారం చేశారు. దినికి సంబంధించిన పూర్తి వివరాలతో టిటిడి శ్వేతపత్రాన్ని విడుదల చేసినా తనదైన ప్రచార ధాటితో దాన్ని అరణ్య రోదనగా మార్చేసింది టీడీపీ సోషల్‌ మీడియా, టీడీపీ అనుకూల ప్రధాన స్రవంతి మీడియా. జగన్ హయాంలో శ్రీవాణి ట్రస్ట్ కి భారీ గానే విరాళాలు వచ్చాయి. డిపాజిట్ల పై వడ్డియే 100 కోట్లు వచ్చిందంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు. శ్రీవాణి ట్రస్ట్ నిధులుతో 130 పురాతన ఆలయాలను పునర్నిర్మాణం చెయ్యడంతో పాటు 3 వేలకు పైగా రామాలయాలను నిర్మించింది టిటిడి. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూతన ఆలయాలను నిర్మించింది. అమరావతి, వైజాగ్, జమ్ము వంటి ప్రాంతాల్లో ఆలయ నిర్మాణం చెయ్యడంతో పాటు ముంబాయిలో ఆలయ నిర్మాణం పనులు ప్రారంభించింది. ఇలా కన్యాకుమారి నుంచి జమ్ము వరకు శ్రీవారి వైభవాన్ని చాటేలా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టిటిడి కార్యక్రమాలు నిర్వహిస్తే కూటమి నేతలు మాత్రం శ్రీవాణి ట్రస్ట్ పై అసత్య ప్రచారాలు చేశారు.

కూటమి అధికారంలోకి రాగానే సియం తిరుమల ప్రక్షాళన అన్నారు. టిటిడి చైర్మన్ అయితే ఏకంగా పదవి భాద్యతలు స్వీకరించకముందే శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేస్తామంటు ప్రకటించేశారు. కాని అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి నేతలకు ఇప్పుడు శ్రీవాణి ట్రస్టే దిక్కయ్యింది. రద్దు సంగతి ప్రక్కన పెడితే గతంలో రోజుకు వెయ్యి టిక్కెట్లు మాత్రమే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టిక్కెట్లు జారీ చేస్తూండగా కూటమి ప్రభుత్వం దానిని 1500 కి పెంచింది. అటు తరువాత చైర్మన్ శ్రీవాణి ట్రస్ట్ రద్దు కాదు పేరు మారుస్తామంటూ మరో స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. పేరు మార్పు అంటే వేంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ లో వేంకటేశ్వర స్వామి పేరు తీసేస్తారా అన్న విమర్శలు కూడా అప్పట్లో వచ్చాయి. ఇక అది సాధ్యకాకపోయే సరికి శ్రీవాణి ట్రస్ట్ తరహలో శ్రీవాణి నిధి ఏర్పాటు చేస్తున్నామని సియం చేత ప్రకటించేశారు. ఇలా రద్దుతో మొదలై పేరు కూడా మార్చలేని పరిస్ధితి. చివరికి వారి హయాంలో మొదలు పెట్టిన ట్రస్ట్ ని ప్రక్కన పెట్టేసి, వాళ్లే క్రొత్తగా ట్రస్ట్ ప్రారంభించి… శ్రీవాణి  ట్రస్ట్‌ని ప్రక్షాళణ చేశామనే అభిప్రాయం కలిగించడానికి అపసోపాలు పడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శ్రీవాణి నిధులు ప్రక్కదారి పట్టాయంటు ప్రచారం చేసిన కూటమి నేతలు ఇప్పుడు ఆ శ్రీవాణి నిధులుతోనే దేశవ్యాప్తంగా, సాధ్యపడితే ప్రపంచ వ్యాప్తంగా ఆలయాలు నిర్మించడానికి సంసిద్దులవుతున్నారు. ఆలయాలు నిర్మాణం స్వాగతించదగిందే కానీ అవాస్తవ ఆరోపణలు చేసిన కూటమి ప్రభుత్వం శ్రీవారికి క్షమాపణ చెప్పకుండా శ్రీవాణి నిధులు వినియోగించే నైతికత లేదు అనేది మాత్రం శ్రీవారి భక్తుల అభిప్రాయం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com