26.7 C
Hyderabad
Monday, April 20, 2026

Live Video

spot_img

సెంచరీ కొట్టిన శ్రీహరి కోట

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట అంతరిక్షకేంద్రం రాకెట్‌ ప్రయోగాల్లో సెంచరీ కొట్టింది. ఉద్విగ్న వాతావరణం మధ్య చారిత్రాత్మక ప్రయోగం చేసింది. శ్రీహరికోట నుంచి ఇస్రో ఇవాళ వందో ప్రయోగం సక్సెస్‌ఫుల్‌గా చేసింది. తన వందో మిషన్‌ అయిన ఎన్‌విఎస్-02 నావిగేషన్ శాటిలైట్‌ను ఈరోజు ఉదయం 6.23 గంటలకు శ్రీహరికోట నుండి లాంచ్ వెహికల్ జిఎస్‌ఎల్‌వి-ఎఫ్ 15 ద్వారా ప్రయోగించింది. ఇస్రో చైర్మన్‌గా నారాయణన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది తొలి మిషన్‌.

జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌15 రాకెట్‌ ప్రయోగం కోసం నిన్నఅర్థరాత్రి 2.53 గంటల నుంచి కౌంట్‌డౌన్‌ మొదలయ్యింది. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్15 రాకెట్‌ 50.9 మీటర్లు పొడవు, 2వేల 250 కిలోల బరువు ఉంది. నావిక్‌లో భాగమైన ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహాన్ని ఇస్రో కక్ష్యలోకి పంపుతోంది. ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహం బరువు 2వేల 250 కిలోలు. కొత్తతరం నావిగేషన్ ఉపగ్రహాల్లో ఎన్‌వీఎస్‌-02 రెండోదిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎన్‌ఎస్‌వీ-01 ఉపగ్రహాన్ని 2023 మే 29న ప్రయోగించింది ఇస్రో . ఎన్‌ఎస్‌వీ-02 ఉపగ్రహాన్ని యూఆర్‌ శాటిలైట్ సెంటర్ డిజైన్ చేసింది.

భౌగోళిక, వైమానిక, సముద్ర నేవిగేషన్ సేవల కోసం ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది. వ్యవసాయంలో సాంకేతికతకు, విమానాల నిర్వహణ కోసం ఈ ప్రయోగం చేశారు. మొబైల్ డివైజ్‌లలో లొకేషన్‌కు సంబంధించిన సేవల కోసం కూడా ఈ ఉపగ్రహ ప్రయోగం ఉపయోగపడుతుందని చెబుతున్నారు. శ్రీహరికోటలో అంతరిక్షకేంద్రం ఏర్పాటు చేసిన తర్వాత తొట్టతొలిగా 1979లో షార్‌ నుంచి చేపట్టిన మొదటి ప్రయోగం రోహిణి విఫలమయ్యింది. ఆ తర్వాత వరుసగా సక్సెస్‌లు సొంతం చేసుకుంటూ వస్తోంది. అయితే, ఇప్పటి వరకు షార్ నుంచి ఇస్రో జరిపిన 99 ప్రయోగాల్లో 9 మాత్రమే విఫలమయ్యాయి. ఇప్పుడు వందో రాకెట్‌ ప్రయోగించి.. ఈ కేంద్రం సెంచరీ కొట్టేసింది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com