27.9 C
Hyderabad
Friday, June 5, 2026

Live Video

spot_img

ఎస్ఆర్ హెచ్ గెలిచింది.. కానీ ఒకటి తగ్గింది

తొలి మ్యాచ్‌లోనే తన సత్తా ఏంటో చాటి చెప్పింది సన్ రైజర్స్ హైదరాబాద్. తాము గ్రౌండ్‌లోకి దిగితే ప్రత్యర్థి టీమ్‌లను ఎంత విధ్వంసం చేస్తామో అని మరోసారి రుజువు చేశారు హైదరాబాద్ ప్లేయర్లు. రాజస్థాన్‌ రాయల్స్‌కు కూడా అదే టేస్ట్ రుచి చూపించారు. అయితే మరో మూడు పరుగులు చేసి ఉంటే ఐపీఎల్ హిస్టరీలో మరో రికార్డును తమ ఖాతాలో వేసుకునేది SRH.

హైదరాబాద్ వేదికగా జరిగిన రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో గెలిచింది SRH. తమ సీజన్‌ను విక్టరీతో మొదలుపెట్టింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన SRH.. ఆరంభం నుంచే రాయల్స్ బౌలర్లపై విరుచుకపడ్డారు. అభిషేక్ శర్మ కాస్త నిరాశపరిచినా.. ఎప్పటిలాగానే హెడ్ తన ప్రతాపం చూపించాడు. 31 బాల్స్ ఆడిన హెడ్.. 3 సిక్స్‌లు, 9 ఫోర్లతో 67 పరుగులు చేశాడు. ఇక ఇషాన్ కిషన్ ఆట అద్భుతమనే చెప్పాలి. జస్ట్ 45 బంతుల్లో సెంచరీ చేశాడు. క్లాసెన్ 34, నితీష్‌కుమార్ రెడ్డి 30 పరుగులతో మెరుపులు మెరిపించారనే చెప్పాలి. ఓవరాల్‌గా చూస్తే క్రీజులోకి ఏ ప్లేయర్ వచ్చినా పరుగుల వరద పారించడమే పనిగా పెట్టుకున్నారు. దీంతో SRH 286 పరుగులు చేయగలిగింది.

ఇక 287 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న యశస్వి జైశ్వాల్ కేవలం ఒకటే పరుగుకు పెవిలియన్ చేరుకున్నాడు. ఆ తర్వాత రియాన్ పరాగ్‌ కూడా ఔటవ్వడంతో రాయల్స్‌ కష్టాలు మొదలయ్యాయి. అయితే సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్ దూకుడుగా ఆడారు. సంజూ 66 పరుగులు.. ధ్రువ్ జురెల్ 70 పరుగులతో చెలరేగాయి. ఆ తర్వాత హెట్మేయర్, దూబే కూడా దూకుడుగా ఆడారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో 242 పరుగులు చేసి ఆలౌటైంది రాజస్థాన్ రాయల్స్.

మొత్తానికి SRH ఆటతో ఈ సీజన్‌లో తాము ఎంత భయంకరమో మరోసారి చెప్పకనే చెప్పారు. ఇక జోఫ్రా ఆర్చర్‌ నాలుగు ఓవర్లు వేసి ఏకంగా 76 పరుగులు ఇచ్చాడు. ఇదే ఐపీఎల్‌లో అత్యధికంగా ఇచ్చిన పరుగులు ఇచ్చిన బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇక SRH మరో రెండు పరుగులు చేసి ఉంటే.. తాము నెలకొల్పిన అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్ చేసి ఉండేది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com