చెన్నై వేదికగా CSKతో తొలి మ్యాచ్ ఆడింది ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇలా సీజన్ ప్రారంభంలో ఆడే తొలి మ్యాచ్‌లో ఓడిపోవడం ఇది ముంబైకి 13వ సారి. నిజానికి ఈసారి చెన్నైపై గెలిచి ఈ ఓటములకు బ్రేక్ చేస్తారనుకుంటే.. సీన్ రివర్స్ అయ్యింది.
అయితే కొందు ఫ్యాన్స్ దీనిని సెంటిమెంట్‌గా కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ముంబై కప్పు కొట్టిన ఐదు సార్లు కూడా తొలి మ్యాచ్‌లో ఓడింది. అందుకే దీన్ని శుభసూచకంగా కూడా చూసేవాళ్ల సంఖ్య చాలా ఎక్కువనే చెప్పాలి.
2013 నుంచి ఈ ఓటములు కొనసాగుతున్నాయి. ఆ ఏడాది RCBపై 2 పరుగుల తేడాతో ఓడింది ముంబై ఇండియన్స్. 2014లో KKRపై 41 పరుగుల తేడాతో.. 2015లో అదే KKRపై 7 వికెట్ల తేడాతో.. 2016లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌పై9 వికెట్ల తేడాతో.. 2017లో మళ్లీ అదే పుణేపై 7 వికెట్ల తేడాతో ఓడింది. ఇక 2018లో CSKపై ఒక వికెట్ తేడాతో ఓడింది. 2019లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 37 పరుగులతో.. 2020లో CSKపై 5 వికెట్ల తేడాతో.. 2022లో DCపై 4 వికెట్ల తేడాతో.. 2023లో RCBపై 8 వికెట్ల తేడాతో.. 2024లో గుజరాత్ టైటా్స్‌పై 6 పరుగుల తేడాతో.. ఇప్పుడు మళ్లీ CSKపై ఓడింది ముంబై.
ఓవరాల్‌గా చూస్తే తొలి మ్యాచ్‌లో RCB, చెన్నై సూపర్ కింగ్స్ చెరో మూడుసార్లు మట్టికరిపించగా.. KKR, పుణే, DC తలో రెండుసార్లు ఓడించాయి. గుజరాత్ టైటాన్స్ మాత్రం ఒకసారి ముంబైని ఓడించింది.