చెన్నై చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను మట్టి కరిపించింది చెన్నై సూపర్ కింగ్స్. తమ కోటలోకి ఎవరు వచ్చినా వారికి ఓటమి తప్పదని ప్రూవ్ చేసింది. స్లో పిచ్‌పైన స్కోర్ చేసేందుకు ముంబై బ్యాటర్లు ఇబ్బందులు పడ్డారనే చెప్పాలి. ఏకంగా 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేశారు ముంబై ఇండియన్స్.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్‌కు మొదటి ఓవర్‌లోనే షాక్ తగిలింది. రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఎవ్వరూ కూడా ధాటిగా ఆడలేదు. అయితే రాబిన్, బౌల్ట్ తప్ప.. తలా కొంచెం స్కోర్ చేయడంతో ముంబై స్కోర్ 150 పరుగులు దాటింది. ఈ క్రెడిట్ మొత్తం చెన్నై బౌలర్లకే దక్కుతుందని చెప్పాలి. నూర్ అహ్మద్ అయితే ఏకంగా మూడు వికెట్లు తీసి ముంబైకు షాక్ ఇచ్చాడు.
అయితే సీఎస్‌కే మాత్రం గెలుపు అంత ఈజీగా రాలేదనే చెప్పాలి. రెండో ఓవర్‌లోనే రాహుల్ త్రిపాఠిని పెవిలియన్‌కు పంపిన ముంబైకి.. రచిన్ రవీంద్ర, రుత్‌రాజ్‌ను ఎదుర్కోవడం కష్టంగానే మారిందని చెప్పాలి. రచిన్ ఆచితూచి ఆడగా.. రుత్ రాజ్ మాత్రం రెచ్చిపోయాడు. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే ముంబై ఇండియన్స్ అమ్ములఅస్త్రం నుంచి బయటికొచ్చిన కొత్త శస్త్రం విఘ్నేష్‌ను మాత్రం ఎదుర్కోలేకపోయారు చెన్నై ప్లేయర్. ఈ యంగ్ స్టార్ వరుసగా వికెట్లు తీసి చైన్నైకు షాక్ ఇచ్చాడు. గైక్వాడ్, దూబే, హుడాను వరుసగా పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత సామ్ కరణ్‌ను విల్ జాక్స్ అధ్బుతంగా బౌల్డ్ చెయడంతో చెన్నైపై ఒత్తిడి పెరిగింది. ఈ సమయంలో బౌల్ట్ వేసిన ఓ ఓవర్ మ్యాచ్‌ను మళ్లీ టర్న్ చేసింది. ఈ ఓవర్‌లో రచిన్ బౌండరీలు బాదడంతో అతడు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు ప్రెజర్ మొత్తం గాలికి ఎగిరిపోయింది. అయితే ఆఖర్లో అనూహ్యంగా జడేజా రన్ ఔట్ అవ్వడంతో క్రీజులోకి ధోని వచ్చాడు.
నిజానికి జడేజా రనౌట్ సమయంలో స్టేడియం మొత్తం ఊగిపోయిందనే చెప్పాలి. ధోని క్రీజులోకి ఎంట్రీ ఇవ్వడంతో CSK ఫ్యాన్స్‌లో పూనకాలు మొదలయ్యాయి. విన్నింగ్ షాట్ కొట్టి తనదైన స్టైల్‌లో మ్యాచ్‌ను ముగిస్తారనుకున్నారంతా. కానీ ఆ ఛాన్స్ రచిన్ కొట్టేశాడు. ఆఖరి ఓవర్లో మొదటి బంతిని సిక్స్‌గా మలిచి మ్యాచ్‌ను ముగించాడు. దీంతో చెన్నై ఫ్యాన్స్ సంబరాలు మొదలయ్యాయి. అయితే ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్ ఓడిపోవడం అనే ఆనవాయితీని మాత్రం కొనసాగించిందనే చెప్పాలి.