స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌కు కొత్త ఏడాదిలో సరికొత్త షాక్ తగిలింది. అంతరిక్ష రంగంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ సరికొత్త విజయాలను సాధిస్తున్న స్పేస్ ఎక్స్ లేటెస్ట్ ప్రయోగం విఫలమైంది. టెక్సాస్‌లోని బొకాచికా నుంచి గురువారం సాయంత్రం 4.37 గంటలకు (భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 4 గంటలకు) రాకెట్‌ను ప్రయోగించారు. అయితే కరేబియన్ మీదుగా భూవాతావరణంలోకి ప్రవేశించినప్పుడు సాంకేతిక లోపం తలెత్తడంతో అది పేలిపోయింది. దీంతో దాని శకలాలు కరేబియన్ సముద్రంలో పడిపోయాయి. పెద్దఎత్తున నిప్పులు చిమ్ముతూ అవి పేలిపోయాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
అయితే స్టార్ షిప్ బూస్టర్ మాత్రం క్షేమంగా లాంచ్ ప్యాడ్‌కు చేరుకుంది. అయితే ఈ రాకెట్ పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్టు స్పేస్ ఎక్స్ తెలిపింది. అయితే ప్రయోగం ఫెయిలైనా స్టార్‌షిప్‌పై ఉన్న నమ్మకాన్ని పెంచిందని ప్రకటించింది.
నిజానికి రాకెట్ ప్రయోగం ప్రారంభమైన 8 నిమిషాల తర్వాత కమ్యూనికేషన్ కట్ అయిపోయిది. 232 అడుగుల భారీ రాకెట్ అయిన స్టార్‌షిప్‌లో మొత్తం 33 రాప్టర్ ఇంజిన్లు వాడారు. లేటెస్ట్ టెక్నాలజీతో దీనిని డెవలప్ చేశారు. తొలి టెస్ట్‌గా పేలోడ్ మాక్ శాటిలైట్లను ప్రయోగించారు.
హైతీ రాజధాని పోర్ట్- ఔ-ప్రిన్స్ గగనతలంలో పేలింది ఈ స్టార్‌షిప్. స్టార్‌షిప్ శకలాలు ఆకాశంలో నుంచి దూసుకొస్తున్న వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్‌గా నిలిచాయి. ముందు జాగ్రత్తగా స్టార్ షిప్ శకలాలు ఢీకొని ప్రమాదాలు జరగకుండా గల్ఫ్ ఆఫ్ మెక్సికో మీదుగా విమానాల రాకపోకలను కంట్రోల్ చేశారు.