31.2 C
Hyderabad
Tuesday, April 21, 2026

Live Video

spot_img

రేవంత్ రెడ్డి పచ్చి మోసగాడు…కెటిఆర్ ఫైర్

ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ ఎస్ అధ్యక్షుడు కెటిఆర్ విమర్శించారు. . త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను తెలంగాణ ప్రజలు ఈ బాకీలు తీర్చామని డిమాండ్ చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చాలని డిమాడ్ చేస్తూ  ఇవాళ చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల కేంద్రంలో రైతు దీక్ష ను బీఆర్ఎస్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు హాజరయ్యారు. రాష్ట్రంలోని ఐదు లక్షల ఆడబిడ్డలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, 70 వేల రూపాయల కళ్యాణలక్ష్మీ తులం బంగారం బాకీ ఉన్నడని కేటీఆర్ విమర్శించారు. ఒక్కో రైతుకు ఎకరానికి 17500 రూపాయల రైతుబంధు పైసలు ఇవ్వాలని డిమాండ్ చేశారు

రైతు దీక్ష కార్యక్రమంలో కేటీఆర్ ప్రసంగం ముఖ్యాంశాలు:-

కెసిఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయినంత గొప్పగా చేవెళ్లలో నాకు స్వాగతం పలికారు. తెలంగాణ మొత్తం ఉద్ధరించిన ఇక ఢిల్లీలో కూడా ఉద్ధరిస్తా. నా మాట నమ్మి ఢిల్లీలో కాంగ్రెస్కు అధికారం ఇవ్వండి అని రేవంత్ రెడ్డి ఢిల్లీలో చెప్పడం పెద్ద జోక్. అవ్వకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? గూట్ల రాయితీనోడు ఏట్లో రాయి తీస్తాడా? తెలంగాణను ఉద్ధరించనోడు ఢిల్లీల ఉద్దరిస్తాడా? ముఖ్య మంత్రి అనే వ్యక్తి ఇన్ని అబద్దాలు చెప్పొచ్చా?

ముఖ్యమంత్రి అబద్దాలు వింటున్న తెలంగాణ ఆడబిడ్డలు కోపానికొస్తున్నారు . రుణమాఫీ చేస్తానని చేయలేదని చిన్నమ్మ అనే మహిళ రైతు తన ఆవేదనను నాతో చెప్పుకుంది. 6 గ్యారంటీలు అన్నడు కాని అర గ్యారెంటీ మాత్రమే అమలైంది. ఫ్రీ బస్సు ఒక్కటే అమలైంది. తమ ఊరికి బస్సు రావడం లేదు. ఇంకా ఫ్రీ బస్సు ఎక్కడిది అని కొంతమంది మహిళలు అంటున్నారు. జనాలు తిట్టే తిట్లు వింటే రేషమున్నోడు ఎవరైనా ఒక బకెట్ల నీళ్లు తెచ్చుకొని మునిగి సస్తారు కానీ  రేవంత్ రెడ్డి కి సిగ్గు శరం లేదు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్తాడు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విడిచిపెట్టం. తను ముఖ్యమంత్రి కాగానే రెండు లక్షల రుణమాఫీ ఫైల్ మీద సంతకం పెడతా అన్నాడు కానీ రుణమాఫీ కాలేదు.

రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డి పల్లెలో కాని ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్ లోని ఒక్క ఊర్లో అయినా రైతులకు వంద శాతం రుణమాఫీ అయిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ముఖం మీదనే చెప్పిన. నా ఛాలెంజ్ కు రేవంత్ నుంచి సమాధానం రాలేదు.

రాష్ట్రంలోని ఏ ఊర్లో అయినా ఏ నియోజకవర్గంలో అయినా రైతులు 100% రుణమాఫీ అయిందని చెప్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులం రాజీనామా చేస్తాం. చారాణా కోడికి బారాణా మసాలా అన్నట్టు  తెలంగాణలో రుణమాఫీ కాకున్నా  ఢిల్లీకి పోయి రుణమాఫీ మొత్తం చేసిన అని రేవంత్ గప్పాలు కొడుతున్నాడు.

భిక్షం వేసినట్టు కేసీఆర్ రైతుబంధు పదివేలు ఇస్తున్నడు నన్ను గెలిపిస్తే 15000 ఇస్తా అని రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పిండు. కానీ సంవత్సరం దాటినంక కూడా రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఎలక్షన్ల ముందు కేసీఆర్ 7500 కోట్లు నిధులను రైతుబంధుకు ఇవ్వబోతే వాటిని ఇవ్వద్దు అని ఎలక్షన్ కమిషన్కు రేవంత్ రెడ్డి లెటర్ రాసిండు. కాంగ్రెస్ నాయకులు అడగడంతోనే మోడీ ఆపిండు.ఎలక్షన్లు అయిపోయినంక ఒక రూపాయి కూడా వెయ్యలేదు.

కేసీఆర్ ఉన్నప్పుడు నాట్లప్పుడు రైతులకు పైసలు పడేది కానీ రేవంత్ రెడ్డి వచ్చినంక ఓట్లప్పుడు  మాత్రమే పైసలు పడుతున్నాయి. పార్లమెంటు ఓట్లప్పుడు మాత్రమే రైతులకు డబ్బులేసిండు. కానీ వానాకాలం పంటకు పడలేదు. షాబాద్ రైతు దీక్ష ఆరంభం మాత్రమే. త్వరలోనే రాష్ట్రమంతటా రైతు దీక్ష సభలు పెడతాం. రైతులకు 10,000 కాదు 15000 ఇస్తానన్న రేవంత్ రెడ్డి జనవరి 26 నుంచి 12000 కాదు 15000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.

వానకాలం నాటికి వేయాల్సిన రైతుబంధు పైసల్ని కూడా కూడా వేయాలి. ఎకరానికి 17500 రూపాయలను రాష్ట్రంలోని ఒక్కో రైతులకు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నడు. రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను ఎకరానికి బాకీ ఉన్న 17,500రూపాయలు ఇవ్వమని గల్లా పట్టుకొని రైతులు అడగాలి.  కాంగ్రెస్ అభయహస్తం ఇప్పుడు భస్మాసుర హస్తం అయింది. అన్న వస్త్రం కోసం పోతే ఉన్నవస్త్రం పోతుందని కేసీఆర్ చిలక చెప్పినట్టు చెప్పిండు.

రాష్ట్రంలో ఉన్న కోటి 60 లక్షల ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి నెలకు 2000 చొప్పున ఒక సంవత్సరంలోనే 30 వేల రూపాయలు బాకీ ఉన్నడు.  ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులు ముందు తమ 30 వేల రూపాయలు బాకీ తీర్చాలని ఆడబిడ్డలు అడగాలి. ఒక సంవత్సరంలో తెలంగాణలో దాదాపు 5 లక్షల పెళ్లిల్లు అయినయ్. రేవంత్ రెడ్డికి తులం బంగారం దొరకడం లేదా?  పెళ్లిళ్లు చేసుకున్న ఐదు లక్షల ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి తులం బంగారం అంటే దాదాపు 70 వేల రూపాయలు బాకీ ఉన్నాడు.

రేవంత్ రెడ్డి పచ్చి మోసగాడు పచ్చి అబద్దాలకోరు రాష్ట్రంలో ఎవరిమీదైనా చీటింగ్ కేసు పెట్టాలంటే రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ , కాంగ్రెస్ నాయకుల మీదనే ఆడబిడ్డలు, రైతులు చీటింగ్  కేసు పెట్టాలి. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సంకలో చేరిండు. చేవెళ్లలో త్వరలో ఉప ఎన్నిక రాబోతుంది. చేవెళ్ల ఒక్కటే కాదు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ త్వరలో ఎన్నికలు జరుగుతాయి.

రైతు భరోసా ఇవ్వనందుకు, రుణమాఫీ అని మోసం చేసినందుకు, 2500 అని ఆడబిడ్డలను మోసం చేసినందుకు, ఆరు గ్యారెంటీలను అమలు చేయనందుకు, భూములు ఇవ్వమన్న పాపానికి అన్యాయంగా లగచర్ల రైతులను జైల్లో వేసినందుకు, హీర్యా నాయక్ అనే రైతుకు గుండెపోటు వస్తే బేడీలు వేసి హాస్పటల్ తీసుకపోయినందుకు, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు ఓటుతోనే బుద్ధి చెప్పాలి

ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలి. అవి అమలు చేసే వరకు మేము వెంటాడుతూనే ఉంటాం. రైతుల పక్షాన, వృద్ధుల పక్షాన, మహిళల పక్షాన, రేవంత్ ప్రభుత్వాన్ని వెంటాడుతాం. 4000 ఇస్తానని వృద్ధులను రేవంత్ రెడ్డి మోసం చేసిండు. కెసిఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తాను ఇచ్చినట్టు ఢిల్లీలో రేవంత్ రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటు. జనవరి 26 నుంచి రైతు బంధు 15000 ఇవ్వాలి.  22 లక్షల మంది కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇవ్వాలి.

రైతు కూలీలకు నెలకు వెయ్యి చొప్పున సంవత్సరానికి ₹12,000 బరాబర్ ఇవ్వాలి. అధికారంలోకి రాకముందు మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ పని చేయాలి.  రైతుకు కులం లేదు మతం లేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుంటే రాబోయే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీపును తెలంగాణ ప్రజలు చింతపండు చేస్తారు.

ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిన టిఆర్ఎస్ నాయకులు రైతు దీక్షను బ్రహ్మాండంగా జరిపినందుకు అభినందనలు తెలుపుతున్నాను. 21 తారీకు నాడు నల్లగొండలో రైతు ధర్నా ఆ తర్వాత అన్ని జిల్లాల్లోనూ రైతు దీక్షలు జరుపుతాం. ఎన్ని కేసులు పెట్టినా జైలుకు పంపిన రైతుల పక్షాన కొట్లాడుతూనే ఉంటాం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com