- అట్టహాసంగా ఉత్సవాలు.. రంగంలోకి డోనార్లు
- అదేరోజు కీలక ఒప్పందాలపై సంతకాలు
- పెద్ద సంఖ్యలో విదేశీ అతిధలు
అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఈ నెల20న అంటే సోమవారం రెండో సారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ట్రంప్ రెండోసారి విజయం అమెరికా చరిత్రలోనే ఘనవిజయం. ఈసందర్భంగా రెండురోజుల ముందునుంచే ఉత్సవాలు మొదలవుతున్నాయి. అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ పగ్గాలు స్వీకరించే శుభ తరుణాన్ని యావత్ ప్రపంచం వెయ్యి కళ్లతో గమనిస్తోంది. ఈ ఎన్నికలలో బైడన్ చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నారు. దాంతో కమలాహారిస్ ట్రంప్ ప్రధాన ప్రత్యర్ధిగా నిలిచారు. ట్రంప్ అధ్యక్ష పగ్గాలు స్వీకరిస్తుంటే, ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణం చేయనున్నారు. దీనికోసం శనివారం అంటే 18వ తేదీ నుంచే ఫైర్ క్రాకర్స్ కాల్పులతోసంబరాలు మొదలవుతున్నాయి.
కీలక అగ్రిమెంట్లపై సంతకాలు…
అసలు అగ్రరాజ్యం అధిపతిగా ప్రమాణ స్వీకారం అంటేనే చాలా ప్రాధాన్యత ఉంటుంది. అదీ గాక ఒక అధ్యక్షుడు పదవీ విరమణ, మరో అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం రెండు ఒకే రోజు జరగబోతున్నాయి. ప్రమాణం రోజునే కొన్ని కీలక ఒప్పందాలపైనా, అంశాలపైనా ఆయన సంతకాలు చేయబోతున్నారు. చమురు సహజ వాయువుల నిక్షేపాల వెలికి తీత, బోర్డర్ సెక్యూరిటీ అంశం.. ఈ రెండు ఆయనకు అత్యంత ప్రాధాన్యతా అంశాలు. వీటిపై ట్రంప్ సంతకం చేయడం చరిత్రాత్మకం.
సోమవారం కేపిటల్ నగరం ముందు యూఎస్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్ అమెరికన్ కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు ప్రమాణం చేయిస్తారు. అనంతరం ఆయన ప్రారంభోపన్యాసం చేస్తారు. అమెరికా చరిత్రను మరింత మహోన్నతంగా తీర్చి దిద్దడం, ఐక్యతను చాటి చెప్పడమే అజెండాగా ట్రంప్ ప్రసంగం ఉండబోతోంది. 2017లో అమెరికాను ధ్వంసమైన దేశంగా ట్రంప్ అడ్రస్ చేశారు. కానీ ఈసారి ప్రసంగం దానిని కవర్ చేసేదిగా ఉంటుందని సమాచారం. పదవీ విరమణ చేస్తున్న జో బైడెన్ ట్రంప్ ప్రమాణ స్వీకారంలో పాల్గొని చివరి వరకూ ఉంటారు. గతంలో తనను ట్రంప్ అనుమతించలేదని బైడెన్ అన్నారు.
అతిధులకు టిక్కెట్ల పంపిణీ…
కేపిటల్ గ్రౌండ్స్ వేదికగా ప్రమాణ స్వీకార ఉత్సవాన్ని తిలకించడానికి వచ్చే వారికోసం 2,20 వేల టిక్కెట్లను అందుబాటులోకి తెచ్చారు.నేషనల్ మాల్‌ను పర్యవేక్షించే నేషనల్‌పార్క్ సర్వీస్ ప్రమాణ స్వీకార ఏర్పాట్లకోసం బిజీ బిజీగా పనులు చేస్తోంది. అన్ రిజర్వుడు కేటగిరీలో ఓపెన్ పబ్లిక్ 2 లక్షల 50 వేల మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. కౌంటీ మ్యూజిక్ స్టార్ కేరీ అండర్ వుడ్ ఈ సందర్భంగా ఒక ప్రోగ్రామ్ ఇవ్వబోతున్నారు.
రొటీన్ కి విరుద్ధంగా ట్రంప్ ఈసారి ప్రమాణోత్సవానికి పెద్ద సంఖ్యలో విదేశీ నేతలను ఆహ్వానిస్తున్నారు. గతంలో సెక్యూరిటీ కారణాలతో విదేశీ అతిధులెవరినీ ఈ ఉత్సవానికి పిలవలేదు. కానీ ఈసారి పిలిచారు. ట్రంప్ ని మొదట్నుంచీ సమర్ధిస్తున్న అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ ఈసారి ప్రమాణ స్వీకారానికి వస్తున్నారు. మరో మద్దతు దారుడైన ఇటాలియన్ ప్రధాని ఈ వేడుకకు వస్తున్నారు. భారత్ నుంచి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ హాజరయ్య అవకాశం ఉంది. చాలా ముందుగానే సమాచారం ఇచ్చినా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఈ ఉత్సవానికి రావడం లేదు. తనబదులు మరో దూతను పంపుతున్నారు. ట్రంప్ సలహా దారు ఎలన్ మస్క్, స్పేస్ ఎక్స్ అండ్ టెస్లా సిఈవో, అమెజాన్ కుచెందిన జెఫ్ బెజోస్, మెటా ప్లాట్ ఫామ్ కి చెందిన మార్క్ జుకర్ బర్గ్ ఈ ఉత్సవంలో ప్రత్యేక సీట్లలో కనిపిస్తారు.
వైట్ హౌస్ కి పెరేడ్…
యూఎస్ కేపిటల్ లో అతిధులకు భోజన మర్యాదలు అవగానే పెన్సిల్వేనియా అవెన్యూ నుంచి ట్రంప్ ప్రత్యేక మోటార్ కేడ్ లో వైట్ హౌస్ కు తరలి వస్తారు. అధ్యక్షుల వారి వెంట మిలటరీ రెజిమెంట్లు, స్కూల్ మార్చింగ్ బ్యాండ్స్, జనరల్ పబ్లిక్ అందరూ వెంట రాగా ట్రంప్ కేపిటల్‌కు చేరుకుంటారు.
తొలిరోజు వంద ఫైళ్లపై సంతకాలు…
ప్రమాణం పూర్తి కాగానే తొలిరోజునే ట్రంప్ దాదాపు 100 వరకూ ఫైళ్లకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇవ్వనున్నారు. అక్రమ వలస దారులను ఉక్కు పాదంతో అణచివేసేందుకు ప్రత్యేక ఇమ్మిగ్రేషన్ అధికారాలు ఇస్తున్నారు. అలాగే మెక్సికో, అమెరికా మధ్య సరిహద్దు గోడను నిర్మించే ఆదేశాలు కూడా తొలిరోజే వెలువడతాయి. ఇంధన వనరుల ఉత్సాదకతను రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత చమురు అనే తన గత నినాదాన్ని సాకారం చేస్తున్నారు. 2021జనవరి 6న యూఎస్ ఫెడరల్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన దోషులను క్షమాభిక్ష పెట్టి వదిలేయాలని నిర్ణయించారు.
ట్రంప్ ప్రమాణ స్వీకార వారోత్సవాలలో భాగంగా వాషింగ్టన్ అంతటా 18 గాలా బృందాలు పెరేడ్ చేయనున్నాయి. వీటిలో మూడు అకేషన్లకు ట్రంప్ వ్యక్తిగతంగా హాజరవుతారు. ఆదివారం వాషింగ్టన్ డౌన్ టౌన్ లో మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్ విక్టరీ ర్యాలీకి ట్రంప్ హాజరవుతారు. 2021 ప్రభుత్వ వ్యతిరేక ఘటన తర్వాత కొలంబియా జిల్లాలో ట్రంప్ పాల్గొనే అతిపెద్ద ర్యాలీ ఇదే. సోమవారం ట్రంప్ సన్నిహితుడు మార్క్ జుకర్ బర్గ్ ట్రంప్ కు సహకరించే బిలియనీర్ల డోనార్ ఉత్సవాన్ని దగ్గరుండి నిర్వహిస్తారు. చమురు, సహజవాయువుల వెలికితీత రంగంలో దిగ్గజం హెరాల్డ్ హెమ్మా ట్రంప్ గౌరవార్ధం వైట్ హౌస్ కి సమీపంలో ఉన్న హే ఏడమ్స్ హోటల్ లో అతిపెద్ద గ్రాండ్ గాలా పార్టీ ఇవ్వబోతున్నారు.
ఆతిధ్యం ఖర్చులు ఎవరివి…?
కేపిటల్‌లో ట్రంప్ ప్రమాణ స్వీకార ఖర్చులు, ఉత్సవాల ఖర్చులన్నీ ఆహ్వాన కమిటీ అంటే వీటిని టాక్స్ పేయర్స్ భరిస్తారు. ట్రంప్ శ్రేయోభిలాషులు, సన్నిహితులు, ఆయనతో వ్యక్తిగత లాభం పొందే నిర్ణయాలకు ఆద్యులు వీరంతా ఎవరి ఖర్చులు వారే పెట్టుకుని ఈ సత్కార్యాలను ప్లాన్ చేస్తున్నారు. జెఫ్ బెజోస్, జుకర్ బర్గ్ లాంటి వారు ఇప్పటికే తమవంతుగా పది లక్షల అమెరికన్ డాలర్లను ఈ కమిటీకి విరాళంగా ఇచ్చారు. 2017లో తన ప్రమాణస్వీకారానికి ట్రంప్ పోగేసిన చందాల విరాళాల కంటే ఈసారి 170మిలియన్ డాలర్లు అధికంగా పోగేశారని తెలుస్తోంది.