29.3 C
Hyderabad
Sunday, March 15, 2026

Live Video

spot_img

దక్షిణ కొరియా అధ్యక్షుడిపై వేటు

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్ యోల్‌పై వేటు పడింది. అతడిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందింది. దీంతో ఆయన తన అధ్యక్ష పదవిని కోల్పోయారు. సౌత్ కొరియన్ పార్లమెంట్ నేషనల్ అసెంబ్లీలో అధ్యక్షుడిని తొలగించేందుకు అభిశంసన తీర్మానంపై ఓటింగ్‌కు ఇటు ప్రతిపక్షాలు, అటు అధికార పక్షం పాల్గొన్నాయి. అసెంబ్లీలో మొత్తం 300 సీట్లు ఉండగా.. తీర్మానానికి అనుకూలంగా 204 ఓట్లు పడ్డాయి. విపక్ష పార్టీలకు 192 ఓట్లు అండగా.. అంతకంటే ఎక్కువ ఓట్లు పడటం విశేషం. అధికారంలో ఉన్న తన సొంత పార్టీ నేతలు కూడా ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు.

నిజానికి గత కొన్ని నెలలుగా యూన్‌పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. యూన్ భార్య.. కిమ్ కియోన్ హీ లక్షా 90 వేల ఖరీదైన లగ్జరీ హ్యాండ్ బ్యాగ్ ను ఓ పాస్టర్ నుంచి లంచంగా తీసుకున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. రెండేళ్ల క్రితం నాటి ఈ ఘటనను పాస్టర్ తన వాచ్ కెమెరాతో రికార్డ్ చేయగా.. ఆ వీడియో గత ఏడాది నవంబర్ లో బయటకు వచ్చింది. దీనిపై దర్యాప్తు జరిపిన ప్రాసిక్యూటర్లు క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక ఆ తర్వాత స్టాక్ మార్కెట్ ధరలను ప్రభావితం చేశారని.. ఇన్ ఫ్లేషన్ పెంచేందుకూ ప్రయత్నించారన్న ఆరోపణలు వచ్చాయి. తాజాగా మార్షల్ లాతో ఆయన కెరీర్‌కే ఓ మాయని మచ్చలా మారింది.

ఇది చాలదన్నట్టు నార్త్‌ కొరియాకు అనుకూలంగా వ్యవహరిస్తూ… దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని కంట్రోల్ చేసేందుకు మార్షల్ లా విధిస్తున్నానంటూ యూన్‌ ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు పెరిగాయి. విపక్ష నేతలు మాత్రమే కాదు.. సొంత పార్టీ నేతలు కూడా దీనిపై వ్యతిరేకత వచ్చింది. రాత్రికి రాత్రే పార్లమెంట్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించి మార్షల్ లాను రద్దు చేసేందుకు ఓటింగ్ చేశారు. ఆ దేశ పార్లమెంట్‌లో మొత్తం 300 సీట్లు ఉండగా, ప్రస్తుతం అధికార పీపుల్ పవర్ పార్టీకి 108 సీట్లు ఉన్నాయి. ప్రతిపక్షంలోని అన్ని పార్టీలకు కలిపి 192 మంది ఎంపీలు ఉన్నారు. మంగళవారం రాత్రి జరిగిన ఓటింగ్ లో అధికార పక్షంలోని 18 మంది సభ్యులు సైతం ప్రతిపక్షాలకు అనుకూలంగా ఓటు వేశారు. మొత్తానికి యూన్ సుక్ యోల్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్లు పెరిగాయి. దీంతో ప్రతిపక్షంతోపాటు అధికార పీపీపీ కూడా యూన్ ను గద్దె దింపేందుకు సిద్ధమవ్వడమే కాదు.. అన్నంత పని చేశాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com