35.9 C
Hyderabad
Thursday, June 4, 2026

Live Video

spot_img

దక్షిణ కొరియా అధ్యక్షుడి అరెస్ట్

ఓ దేశానికి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి అరెస్ట్ అవ్వడం అనేది చాలా అరుదు. ఇలాంటి అరుదైన సీన్ జరిగింది సౌత్ కొరియాలో. దేశవ్యాప్తంగా మార్షల్ లాను ప్రకటించి తీవ్ర విమర్శలకు గురవ్వడమే కాదు.. పదవిని కూడా పొగొట్టుకున్న సౌత్ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను ఆ దేశ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అరెస్ట్ అయిన తొలి సిట్టింగ్ అధ్యక్షుడిగా యూన్ రికార్డు సృష్టించారు.

నిజానికి యూన్ సుక్ యోల్‌ ఇప్పటికే అభిశంసనకు గురయ్యారు. గతేడాది డిసెంబర్ 3న మార్షల్ లా ప్రకటించి చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలపై పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. కొన్ని వారాలుగా ఆయన తన హిల్‌సైడ్ రెసిడెన్స్‌లో ప్రైవేటు సెక్యూరిటీని పెట్టుకుని నివసిస్తున్నారు యూల్. అక్కడే ఆయనను అరెస్ట్ చేసిన అధికారులు ఇంటి నుంచి భారీ భద్రత మధ్య తీసుకెళ్లారు.

అతని అరెస్ట్ సమయంలో హైడ్రామా నడిచింది. తెల్లవారుజామున దాదాపు 3 వేల మందికిపైగా పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన ఆయన మద్దతుదారులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాదు అక్రమంగా అదుపులోకి తీసుకోవడంతోపాటు బహిరంగంగా అవమానిస్తున్నారంటూ ఆయన లాయర్లు కూడా అధికారులతో వాగ్వివాదానికి దిగారు. అయినా కానీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

ఏదేమైనా దక్షిణ కొరియాలో ఓ సిట్టింగ్ అధ్యక్షుడిని మాత్రం అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి. ఆయనను గవాచియాన్‌లోని కరప్షన్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ (CIO) కార్యాలయంలో విచారిస్తున్నారు. గతేడాది డిసెంబర్‌ 3న దేశంలో ఎమర్జెన్సీ మార్షల్‌ లా విధించారు యోల్. దీంతో ఆయనపై నేషనల్‌ అసెంబ్లీ 204-85 ఓట్లతో అభిశంసన తీర్మానాన్ని ఆమోదించింది. మార్షల్‌ లాను ప్రకటించిన కేసులో విచారణకు సహకరించకపోవడంతో ఆయనపై అరెస్టు వారెంటు జారీ అయింది. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేసేందుకు అధికారులు ఈ నెల 3 విఫల యత్నం చేశారు. తెల్లవారుజామునే అధ్యక్ష భవనానికి చేరుకున్న అధికారులను సైన్యంతోపాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది అడ్డుకున్నారు. సుమారు ఆరు గంట‌ల పాటు.. అధ్యక్షుడి భ‌ద్రతా సిబ్బందితో పోలీసులు వాగ్వాదానికి దిగారు. చివ‌ర‌కు అరెస్టును వాయిదా వేసుకున్న పోలీసులు వెన‌క్కి మళ్లారు. కానీ ఈసారి మాత్రం అలా జరగలేదు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com