26.7 C
Hyderabad
Thursday, September 17, 2026

Live Video

spot_img

బీసీసీఐ సరికొత్త రూల్‌… ఆడితేనే పేమెంట్.. లేదంటే కట్..!

BGT సిరీస్‌ ఓడిపోవడంతో బీసీసీఐ మొత్తం ప్రక్షాళనకు రెడీ అయ్యింది. ఇప్పటికే ఫ్యామిలీతో కలిసి ట్రావెల్ చేయడం, హోటల్స్‌లో బస చేయడంపై రూల్స్ విధించిన బీసీసీఐ.. మరో సరికొత్త రూల్‌ను కూడా విధించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ఏ ప్రకటన చేయకపోయినా.. కొన్ని జాతీయ న్యూస్ ఏజెన్సీలు మాత్రం కీలక విషయాలను చెబుతున్నాయి.

బీసీసీఐ ప్రతి ఏటా ఆటగాళ్లకు చెల్లించేందుకు ముందుగానే కాంట్రాక్ట్‌లను చేసుకుంటాయి. వారి ప్రదర్శన తీరును బట్టి ఇందులో కేటగిరీలు ఉంటాయి. కానీ ఇకపై వీటితో పాటు మ్యాచ్‌ల్లో వాళ్లు ఆడిన తీరుపైనే వారికి చెల్లింపులు ఉండనున్నాయి. అంతేకాదు సరిగ్గా ఆడకపోతే జరిమానా విధించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తోంది బీసీసీఐ.

నిజానికి పర్ఫామెన్స్‌ ఆధారిత విధానం ఒకటి ఇప్పటికే బీసీసీఐ అమలు చేస్తోంది. ఒక సీజన్‌లో 50 శాతం కంటే ఎక్కువ టెస్టుల్లో తుది జట్టులో ఉండే ఆటగాళ్లకు రూ.30 లక్షల ప్రోత్సాహం ఇస్తోంది బీసీసీఐ. 75 శాతం మ్యాచ్‌లు ఆడితే రూ.45 లక్షలు ఇస్తోంది. ఆటగాళ్లు టెస్టులు లేదా వైట్‌ బాల్‌ ఫార్మాట్లకు ప్రాధాన్యం ఇచ్చేలా ఈ వ్యవస్థను అప్పట్లోనే ప్రవేశపెట్టారు. అయితే ఈ ప్రోత్సాహాలకు తోడు జరిమానాలు కూడా విధించేందుకు కసరత్తు చేస్తోంది బీసీసీఐ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com