30.6 C
Hyderabad
Thursday, June 4, 2026

Live Video

spot_img

రష్య-ఉక్రెయిన్‌ యుద్ధంలో కేరళ వాసి దుర్మరణం

  • రష్యన్‌ ఫ్ంట్‌ లైన్‌ ఆర్మీలో ఉన్న వినీల్‌ బాబు
  • ద్రోన్‌ దాడిలో గాయపడి మరణించిన వినీల్‌
  • భారతీయ సైనికులందరినీ వెనక్కు పంపాలని కేంద్రం ఒత్తిడి
  • అంగీకరించిన రష్యా..

రష్యా,ఉక్రెయిన్‌ యుద్ధంలో మన భారతీయ సైనికులు కూడా ప్రాణాలు విడవడం పట్ల కేంద్రం తీవ్రంగా స్పందించింది. తమ వారిని తక్షణం యుద్ధభూమి నుంచి రిలీవ్‌ చేసి స్వదేశం పంపించాలని రష్యాను కోరింది. దీనికి సంబంధించి మన విదేశాంగ శాఖ రష్యా ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా పూర్తి చేసింది.కేరళకు చెందిన ఓ యువ సైనికుడు రష్యా తరపున ఫ్రంట్‌ లైన్ యుద్ధదళంలో ఉండి సేవలందిస్తున్నారు. అయితే ఆయన నిన్న మరణించినట్లు కుటుంబానికి సమాచార మందింది. దాంతో కేంద్రం స్పందించింది.

త్రిసూర్‌ కు చెందిన వినీల్ బాబు దుర్మరణం

కేరళ త్రిసూర్‌ కు చెందిన వినీల్‌ బాబు అనే వ్యక్తి రష్యా తరపున యుద్ధం చేస్తుండగా డ్రోన్‌ దాడి జరిగింది. ఈ దాడిలో తాను గాయపడినట్లు నిన్న వినీల్ బాబు కుటుంబానికి ఫోన్‌ చేసి తెలిపాడు. అయితే మరుసటి రోజుకల్లా అతగాడు చనిపోయినట్లు తెలుస్తోంది. వినీల్‌ తో పాటు మరో వ్యక్తి కూడా తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ట్రీట్‌మంట్‌ లో ఉన్నాడు. దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. భారతీయులు అనేకమంది ఉద్యోగాల వేటలో రష్యాకు వెళ్లి అక్కడ ఆర్మీలో చేరిపోతున్నారు. అయితే యుద్ధంలో గాయపడిన, మరణించిన వారి మృత దేహాలను తక్షణం వెనక్కు పంపాలని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ రష్యా అధికారులతో మాట్లాడారు.గతేడాది దాదాపు 85 మందిని మన ప్రభుత్వాలు వెనక్కురప్పించాయి.ఇప్పుడు మిగిలిన20మందిని కూడా వెనక్కు పంపాలని కేంద్ర విదేశాంగ శాఖ రష్యన్‌ ఎంబసీతో చర్చలు జరిపింది.

గతేడాది జూలై లో ప్రధాని మోడీ కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సుకు హాజరైనప్పుడు ఇదే అంశాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తో చర్చలు జరిపారు. తాజా పరిణామాలతో మిగిలిన వారిని కూడా సాధ్యమైనంత త్వరగా స్వదేశం రప్పించాలని కేంద్రం భావిస్తోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com