ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లోపల సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్.. గల్లంతైన వాళ్ల ఆచూకీ కోసం వెతుకుతున్నాయి. మరోవైపు.. బోరింగ్ మిషన్లను వెల్డింగ్‌లతో విడదీస్తున్నారు. శిథిలాలను తొలగించే పనులు ముమ్మరం చేస్తున్నారు. టన్నెల్ లోపల రెస్క్యూ టీమ్స్ ఏం చేస్తున్నాయో ఫోటోలను, వీడియోలను ప్రభుత్వం విడుదల చేసింది. ఆ ఫోటోలు, వీడియోలు భాస్కర న్యూస్ పాఠకుల కోసం… చూడండి.
నల్గొండలోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్‌లో శని వారం ప్రమాదంలో 35 మంది కార్మి కులు టన్నెల్‌లో పనులు చేస్తుండగా ఒక్కసారిగా టన్నెల్ కుంగిపో యింది. అయితే ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు టన్నెల్‌లోనే చిక్కుకుపోయారు. ఘటనపై ఇప్పటికే ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయా లని అధికారుల ను ఆదేశించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావులు సంఘటన స్థలికి చేరుకున్నారు.