31.7 C
Hyderabad
Friday, May 22, 2026

Live Video

spot_img

ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల

  • పహల్‌గాం దాడిలో పాల్గొన్న టెర్రరిస్టులు

  • ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం స్కెచ్‌లు

  • ముగ్గురిని గుర్తు పట్టిన పర్యాటకులు

  • బాధితుల సమాచారంతో స్కెచ్‌ గీసిన నిపుణులు

  • ఊహాచిత్రాలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

జమ్ము కశ్మీర్‌లోని పహల్‌గాంలో జరిగిన టెర్రరిస్టు దాడిలో పాల్గొన్న వారిలో ముగ్గురి ఊహా చిత్రాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. నిన్న దాడి జరిగిన సమయంలో ప్రాణాలు దక్కించుకున్న బాధితులు ఇచ్చిన సమాచారంతో భద్రతా బలగాలు ముగ్గురి ఊహా చిత్రాలను రూపొందించారు. వీటిని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం ఏడుగురు ఉగ్రవాదులు ఈ ముష్కర చర్యకు పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతుండగా వారిలో ముగ్గురి ఊహా చిత్రాలు రూపొందించారు.

మరోవైపు.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పహల్‌ గామ్‌ చేరుకున్నారు. ముష్కరులు భీకరంగా దాడి చేసి పలువురిని పొట్టన బెట్టుకున్న ప్రదేశాన్ని పరిశీలించారు. ఉగ్రవాదులు ఎటు వైపు నుంచి వచ్చారు? పర్యాటకులను ఎక్కడ టార్గెట్‌ చేశారు? పురుషులను పరుగెత్తించి మరీ ఎలా కాల్పులు జరిపారు? వంటి వివరాలను అక్కడున్న భద్రతా బలగాలు.. అమిత్‌ షాకు వివరించాయి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com