22 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

కశ్మీర్ బంద్.. 35 ఏళ్ల తర్వాత ఇప్పుడే…

పర్యాటకులే టార్గెట్‌గా ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమానికి వ్యతిరేకంగా కశ్మీర్ ప్రజలు స్వచ్చంధంగా బంద్ పాటించారు. కశ్మీర్‌లో ఇలాంటి ఘటన జరిగి 35 ఏళ్లు అవుతుంది. ఆ తర్వాత ఉగ్రవాదులకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు ఇలాంటి నిరసన చేపట్టడం ఇదే తొలిసారి. ఈ బంద్‌కు జమ్ము కశ్మీర్‌లోని అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలికారు. అన్ని దుకాణాలు, పెట్రోల్‌ బంక్‌లు, వ్యాపారాలు.. ఇలా అన్నింటిని స్వచ్చంధంగా మూసేశారు అక్కడి ప్రజలు. ఇప్పటికే ఉగ్రవాదుల చర్యలను కశ్మీర్‌ ప్రజలు తీవ్రంగా ఖండించారు. పాకిస్థాన్ దీని వెనకుందని ఆరోపిస్తున్నారు. తమ జీవితాలు బాగుపడటం పాకిస్థాన్‌కు ఇష్టం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అమయాక ప్రజలను చంపడం మానుకోండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కశ్మీర్ ప్రజలు. కొన్ని రాజకీయపార్టీలు, మత పరమైన సంస్థలు, వ్యాపార సంస్థలు, పౌర హక్కుల సంస్థలు కూడా ఈ బంద్‌కు మద్ధతు పలికాయి. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కూడా బంద్‌కు మద్ధతు తెలపడంతో రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూల్స్ అన్ని మూతపడ్డాయి.

మరోవైపు కేంద్రహోంమంత్రి అమిత్‌షా ప్రస్తుతం కశ్మీర్‌లోనే ఉన్నారు. మృతుల భౌతిక కాయాలకు నివాళులు అర్పించిన ఆయన.. వారి కుటుంబాలను పరామర్శించారు. ఆ తర్వాత నేరుగా ఎక్కడైతే మారణహోమం జరిగిందో అక్కడికి వెళ్లారు. ఆ ప్రాంతాన్ని కూడా స్వయంగా పరిశీలించారు. దాడి జరిగిన గంటల వ్యవధిలోనే ఆయన కశ్మీర్‌కు పయనమవడం.. ఆ తర్వాత ఏకంగా ఘటన జరిగిన ప్రాంతానికి ఆయన వెళ్లడం చూస్తుంటే ఈ విషయాన్ని కేంద్రం చాలా సీరియస్‌గా తీసుకుందని అర్థమవుతోంది.

ఓవైపు ఇంత జరుగుతున్నా.. మరికొందరు ఉగ్రవాదులు సరిహద్దు దాటి కశ్మీర్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. బారాముల్లాలోని ఉరి వద్ద ఉన్న సర్జీవన్‌ ప్రాంతం గుండా సుమారు ముగ్గురు ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన ఆర్మీ.. వారిని మట్టుపెట్టింది. అయితే ఇద్దరే ఉగ్రవాదులు మృతి చెందగా.. మరొక్కరు వెనక్కి పారిపోయినట్టు తెలుస్తోంది. మృతుల నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com