సల్మాన్ సింగ్ కొత్త సినిమా సికందర్ టీజర్ రిలీజ్ ఫంక్షన్ శనివారానికి వాయిదా పడింది. సల్మాన్ ఖాన్ తన 59వ పుట్టినరోజు నాడు.. ఫ్యూచర్ ప్రాజెక్ట్ అయిన సికందర్ టీజర్ రిలీజ్ చేయాలనుకున్నాడు. నిర్మాతలు దీనికోసం ప్లాన్లు చేసుకున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల 7 నిమిషాలకు టీజర్ రిలీజ్ చేయాలని షెడ్యూల్ కూడా చేశారు. అయితే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో టీజర్ రిలీజ్ వేడుకను వాయిదా వేశారు. శుక్రవారానికి బదులు టీజర్‌ను శనివారం రిలీజ్ చేస్తామని నిర్మాతలు ప్రకటించారు.
సల్మాన్‌ఖాన్ కొత్త సినిమా సికందర్ యాక్షన్ ఫిల్మ్‌లో నటిస్తున్నారు. సికిందర్‌లో సల్మాన్ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. వచ్చే ఈద్‌కు సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్ బిగ్‌బాస్ 14 హోస్ట్‌గా బిజీగా ఉన్నాడు.