తెలుగు సినీ పరిశ్రమలో సంచలనాలు జరుగుతున్నాయి. హీరో అల్లు అర్జున్ అరెస్టు చేసిన పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచే పనిలో ఉండగా… కలక్షన్ కింగ్ మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది.
మనోజ్ అరెస్టు వ్యవహారంలో బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. యాంటిస్పేటరీ బెయిల్ పిటిషన్ ను రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇప్పటికే మోహన్ బాబు పై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసిన రాచకొండ పోలీసులు… ఆయనను ఏ క్షణంలో అయినా అరెస్టు చేసే అవకాశం ఉంది.