24.4 C
Hyderabad
Monday, March 16, 2026

Live Video

spot_img

అల్లు అర్జున్ అరెస్టు…ఆంధ్రా పాలిటిక్స్

పుష్ప2 తొక్కిసలాట వ్యవహారంలో హీరో అల్లు అర్జున్ అరెస్టుపై విభిన్న వాదనలు జరుగుతున్నాయి. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటనలో యాజమాన్యం ప్రాథమికంగా బాధ్యత వహించాలని… ఘటనతో నేరుగా సంబంధం లేకున్నా బన్నీని అరెస్టు చేశారని చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే  అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ మొత్తం రాజకీయాల చుట్టూతిరుగుతోంది.

పుష్ట 2 సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోయిన అల్లు అర్జున్.. తెలగు సినిమా రంగంలో ఐకానిక్ స్ఠార్ అనే ఫేమ్ ను సార్థకం చేసుకున్నాడు. వారంలో వెయ్యి కోట్ల కలెక్షన్ లతో చిత్ర రంగాన్నే ఒక ఊపు ఊపిన అల్లు అర్జున్ .. స్టార్ డమ్ కొన్ని వర్గాల కంటగింపుగా ఉందనే దానిలో సందేహం లేదు.. అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో ఫ్యాన్స్ లో అనేక ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి. పుష్ప -2 రిలీజ్ సమయంలో పవన్ కల్యాణ్ అభిమానులు వ్యతిరేకంగా వ్యవహరించడమే కాకుండా వార్నింగ్ లు కూడా ఇచ్చిన పరిస్థితి అందరికీ తెలిసిందే…రిలీజ్ అనంతరం  సినిమా బోగాలేదనే ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు కూడా..

2024 ఎన్నికల సమయంలో శిల్పా రవికిషోర్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారంలో బన్నీ పాల్గొన్నాడు. నాటి నుంచీ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ,అల్లు అర్జున్ ఫ్యాన్స్ మద్య పంచాయితీ నడుస్తోంది. మెగా ఫ్యామిలీకి , అల్లు అర్జున్ ఫ్యామిలీకి మద్య గ్యాప్ ఉందనే ప్రచారం ఊపందుకోగా… పుష్ప2 రిలీజ్  రోజున స్పష్టంగా కనపడింది. పుష్ప2 బాగోలేదని ప్రచారం చేసిన వారిలో అధికంగా మెగా హీరోల అభిమానులే ఉండటం గమనార్హం.

తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం ఎందుకు అంత స్పీడ్ గా వ్యవహరిస్తోందన్న విమర్శలు ప్రజల్లో నెలకొన్నాయి. దీని వెనుక ఖచ్చితంగా రాజకీయ కారణాలు లేకపోలేదనే చర్చ సినిమా వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఆంధ్రా రాజకీయ పార్టీల నుంచి అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా లాబీయింగ్ జరుగుతోందని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని ఈరోజు చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్ వద్ద అల్లు అర్జున్ అభిమానులు ఓపెన్ గానే చెప్తున్నారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ట్విట్ పై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఏపిలో అధికార పార్టీకి చెందిన పెద్దలు అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంలో తెరవెనుక కీలక పాత్ర పోషించారని ఆరోపణలు వస్తున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com