తెలంగాణలో కొత్తగా ఎన్నికైన ఏడుగురు ఎమ్మెల్సీలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు.
తెలంగాణలో ఇటీవల రెండు టీచర్స్ ఎమ్మెల్సీలు, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే, ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన నలుగురు ఎమ్మెల్సీలతో కూడా మండలి చైర్మన్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్లలో బీజేపీకి చెందిన మల్క కొమురయ్య, అంజిరె్డ్డి, పీఆర్‌టీయూకు చెందిన శ్రీపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం, ఉన్నారు.
బీజేపీకి చెందిన మల్క కొమురయ్య, అంజిరెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు రఘునందన్ రావు, డాక్టర్ లక్ష్మణ్ హాజరయ్యారు.
ఇక, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.