26.4 C
Hyderabad
Sunday, July 26, 2026

Live Video

spot_img

యూఎస్‌లో 700 మంది ఉద్యోగుల తొలగింపు.. TANA, ATA పుణ్యమేనా?

యూఎస్ ఫెడరల్ కంపెనీ ఫాన్నీ మే రెండు రోజుల్లో 700 మంది ఉద్యోగులను తొలగించింది. దీనికి కారణం వారు పని చేయకపోవడం కాదు.. అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతూ కంపెనీని మోసం చేయడం. పనిచేస్తున్న కంపెనీకి కుచ్చుటోపి పెట్టేందుకు TANA, ATAను ఉపయోగించుకున్నట్టు కంపెనీలు నిర్ధారించింది వారిపై వేటు వేశాయి.

ఇందులో కొన్ని ఉద్యోగాలు కంపెనీ ఆర్గనైజేషనల్‌ రీస్ట్రక్చరింగ్ పేరుతో తొలగించినా.. ఎక్కువ మంది ఉద్యోగాలను తొలగించింది మాత్రం కంపెనీని మోసగించించినందుకే. ఇందులో దాదాపు 200 మంది తెలుగువారే ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా TANA, ATA తో కుమ్మకై మ్యాచింగ్ గ్రాంట్స్ ప్రొగ్రామ్ కింద TANAకు డోనేషన్ ఇచ్చినట్టు కలరింగ్ ఇచ్చి.. తిరిగి ఆ డబ్బును వారి ఖాతాల్లోకే మళ్లించుకున్నట్టు తేల్చారు. పని చేస్తున్న కంపెనీనే మోసం చేస్తారా? అంటూ వారందరిని ఇప్పుడు ఉద్యోగాల్లో నుంచి పీకేశారు.

అమెరికాలో తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా – TANA, అమెరికా తెలుగు అసోసియేషన్‌ – ATA ప్రవాస భారతీయులకు సంబంధించిన అసోసియేషన్‌లు. అక్కడ ప్రధానంగా ఈ రెండు సంస్థలు తెలుగు వాళ్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోయిన వారిలో TANA రీజనల్ వైస్ ప్రెసిడెంట్, అమెరికన్ తెలగు అసోసియేషన్ మాజీ అధ్యక్షుడి భార్య కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ స్కామ్‌లో TANA, ATA మాత్రమే కాదు.. ఇంకా అనేక సంస్థలు ఉన్నట్టు తేలింది.

నిజానికి TANA విషయంలో చాలా నెలలుగా అనేక ఆరోపణలు వస్తున్నాయి. అమెరికాలోని తెలుగు సంఘాలతో కుమ్మక్కై కొందరు తెలుగు టెకీలు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. ఆపిల్‌ గ్రాంట్ ప్రోగ్రామ్‌ను దుర్వినియోగం చేశారంటూ.. ఏకంగా 185 మంది తెలుగు ఉద్యోగులను ఆ సంస్థ తొలగించింది. మరికొన్ని సంస్థలు కూడా తెలుగు ఉద్యోగులను తొలగించ వచ్చనే భయందోళనలు అప్పుడే మొదలయ్యాయి. ఇప్పుడు అదే జరిగింది.

కంపెనీల నుంచి తెలుగు సంఘాలకు విరాళాల రూపంలో ఇచ్చిన నిధులు.. ఉద్యోగులు మళ్లీ తమ సొంత అకౌంట్స్‌కు మళ్లించినట్టు తేలింది. నిజానికి ఈ నిధుల కుంభకోణంపై FBI, అమెరికా కోర్టులు రంగంలోకి దిగాయి.మరో విషయం ఏంటంటే TANAకు కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్ట్‌ ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసింది. తానాకు సంబంధించిన మొత్తం సమాచారంతో కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఆ సమాచారాన్ని FBIకి కూడా మెయిల్‌ చేయాలని ఆదేశించింది. ఫిజికల్ డాక్యుమెంట్లతో పాటు, ఎలక్ట్రానిక్‌ డేటా కూడా తీసుకురావాలన్న కోర్టు.. ప్రతి లావాదేవీకి సంబంధించిన వివరాలు సమర్పించాలని ఆదేశించింది. డిస్ట్రిక్ కోర్టు మాత్రమే కాదు.. FBI కూడా TANA సభ్యుల వివరాలు, వాళ్లు సేకరించిన విరాళాలు, ఖర్చుపెట్టిన వివరాలతో పాటు మొత్తం లావాదేవీల వివరాలను పంపించాలని కోరింది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com