తెలంగాణలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏ2గా ఉన్న నిందితుడు సుభాష్ కుమార్ శర్మకు నల్లగొండ కోర్టు ఉరిశిక్ష విధించింది. మిగతావారికి జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది.
తన కూతురు అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడనే కక్షతో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారుతీరావు 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్‌ను హత్య చేయించాడు. ఎనిమిది మందిని నిందితులుగా పేర్కొంటూ పోలీసులు 2019లో ఛార్జిషీటు దాఖలు చేశారు. మారుతిరావుతో పాటు సుభాష్‌కుమార్‌శర్మ, అస్గర్ అలీ, అబ్దుల్ భారీ, ఎంఏ కరీం, శ్రావణ్ కుమార్, ఆటో డ్రైవర్ నిజాం, మారుతీరావు కారు డ్రైవర్ శివలను నిందితులుగా తేల్చారు. ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం, హత్య ఆరోపణల కింద అరెస్టు చేశారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న మారుతీరావు మార్చి 7, 2020న ఆత్మహత్య చేసుకున్నాడు. 2019లో సుభాష్ శర్మ తప్ప మిగతా వారందరికీ బెయిల్ లభించింది. సుమారు ఐదేళ్లకు పైగా కోర్టులో విచారణ సాగింది.