29.2 C
Hyderabad
Thursday, September 17, 2026

Live Video

spot_img

తెలుగు రాష్ట్రాల్లో ఆక్టోపస్ బలగాలతో భద్రత

పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత కఠిన చర్యలకు ఉపక్రమించిన కేంద్రప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. దేశంలోని రైల్వేలకు, రద్దీ ప్రాంతాల్లో టెర్రరిస్టులు అలజడి సృష్టించే ముప్పు పొంచి ఉందని అలర్ట్‌ చేసింది.

ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలకు కేంద్రహోంమంత్రిత్వ శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఇటీవలి పరిణామాల దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలను  హై-అలర్ట్ జోన్‌లుగా ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో భద్రత బలోపేతం చేయాలని, ప్రజల రక్షణకు ఈ రాత్రి నుంచి ప్రత్యేక ఆక్టోపస్ (ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల సంస్థ) బృందాలు ఈ ప్రాంతాల్లో మొహరించనున్నారు.

అక్టోపస్‌ బలగాలు మొహరించే ప్రాంతాలు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ – హైదరాబాద్

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం – హైదరాబాద్

తిరుమల మరియు అలిపిరి – తిరుపతి

రైల్వే స్టేషన్ – విశాఖపట్నం

రామకృష్ణ బీచ్ – విశాఖపట్నం

రైల్వే స్టేషన్ – విజయవాడ

కూకట్‌పల్లి – హైదరాబాద్

నాంపల్లి – హైదరాబాద్

మహాత్మా గాంధీ బస్ స్టేషన్ – హైదరాబాద్

తదుపరి నోటీసులు వచ్చే వరకు ఉత్తర్వులు అమలులో ఉంటాయని కేంద్రహోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com