27 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

వైట్‌ హౌస్‌లో కీలకపదవిలో తెలుగబ్బాయి

సీఐఎస్‌ఏ డిప్యూటీ డైరెక్టర్‌ గా మధు గొట్టుముక్కల

మరో భారతీయ తెలుగు తేజానికి అమెరికా ప్రభుత్వంలో కీలక పదవి దక్కింది. ప్రతిష్టాత్మకమైన సైబర్‌ సెక్యూరిటీ మరియు మౌలిక సదుపాయాల భద్రతా సంస్ధ (సీఐఎస్‌ఏ) డిప్యూటీ డైరెక్టర్‌గా మధు గొట్టుముక్కలను నియమించినట్లు సీఐఎస్‌ఏ వర్గాలు ప్రకటించాయి. మే 16వ తేదీని మధు గొట్టుముక్కల సీఐఎస్‌ఏ డిప్యూటీ డైరెక్టరుగా బాధ్యతలు తీసుకుంటారు. ప్రస్తుతం ఆయన దక్షిణ డకోటా ప్రభుత్వంలో బ్యూరో ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ అండ్‌ స్టేట్‌ చీఫ్‌ ఇన్మర్మేషన్‌ కమిషనర్‌ గా కొనసాగుతున్నారు. ప్రస్తుత ట్రంప్‌ ప్రభుత్వం మధు గొట్టుకుమక్కలను సీఐఎస్‌ఏ డిప్యూటీ డైరెక్టర్‌ గా నియమించింది. అంతకు ముందు జో బైడన్‌ ప్రభుత్వంలో కూడా నితిన్‌ నటరాజన్‌ అనే ఇండియన్‌ ఆరిజన్ వ్యక్తే సీఐఎస్‌ఏ డిప్యూటీ డైరెక్టర్‌ గా పనిచేశారు. సౌత్‌ డకోటా ప్రజలకు స్టేట్‌ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ గా, బిట్‌ కమిషనర్‌ గా సేవ చేయడం నా కెరీర్‌ లో నాకు దక్కిన గొప్ప గౌరవాలలో ఒకటని మధు గొట్టుముక్కల ఓ ప్రకటనలో తెలియజేశారు. అంత్యంత కీలక సమయంలో నాకు అమెరికా దేశానికి డిజిటల్‌, భౌతిక మౌలిక సదుపాయలను బలోపేతం చేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు మధు అన్నారు. కోనసీమ ప్రాంతం ఐ పోలవరం మండలం కేశనకుర్రు గ్రామానికి చెందిన గొట్టుముక్కల మధు ఇంటర్మీడియట్‌ వరకూ కాకినాడలో చదివారు. తరువాత తన ఇంజనీరింగ్‌ విద్యను ఏలూరులో పూర్తి చేశారు. అనంతరం అమెరికా వెళ్లిన మధు గొట్టుముక్కల అక్కడ యూనివర్శిటీ ఆఫ్‌ టెక్సాస్‌ లో కంప్యూటర్‌ విద్యలో ఎమ్‌ఎస్‌ పూర్తి చేశారు. డల్లాస్‌ యూనివర్శిటీలో ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ లో ఎంబిఏ చేశారు. తదనంతరం డకోటా స్టేట్‌ యూనివర్శిలో ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ లో పీహెచ్‌డీ పూర్తి చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com