“శుక్ర”, “మాటరాని మౌనమిది”, “ఏ మాస్టర్ పీస్” వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ “కిల్లర్” అనే సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన హీరో పాత్రలో నటిస్తుండటం విశేషం. జ్యోతి పూర్వజ్ హీరోయిన్ గా నటిస్తుండగా..మరో ఇద్దరు హీరోలుగా విశాల్ రాజ్, గౌతమ్ యాక్ట్ చేస్తున్నారు.
ఏయు అండ్ఐ మరియు మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డిల కొలాబ్రేషన్ లో నిర్మాణమవుతున్న రెండవ చిత్రమిది.
“కిల్లర్” పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీ ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ పూర్తి చేశారు. రామెజీ ఫిలిం సిటీ, వికారాబాద్ ఫారెస్ట్ ఏరియా, హైదరాబాద్ లో ఈ షెడ్యూల్ చిత్రీకరణ జరిపారు. సెకండ్ షెడ్యూల్ లో హీరో పూర్వాజ్, హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మరో ఇద్దరు హీరోలు విశాల్ రాజ్, గౌతమ్ పాల్గొన్నారు.
“కిల్లర్” సినిమాలో లవ్, రొమాన్స్, ప్రతీకారం, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, థ్రిల్లర్ అంశాలతో రూపొందిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రక్షకుల ముందుకు వస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.