38.2 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

కాంగ్రెస్, బీజేపీ ఎంపీల మధ్య తోపులాట

  • రణరంగంగా పార్లమెంట్…
  • తోపులాటలో సారంగీ తలకు గాయాలు
  • రాహుల్ పై కేసు..
  • ఎంపీలను కొట్టేందుకే కరాటే నేర్చుకున్నారా?
  • ఖర్గే స్పీకర్ కు లేఖ

రాజ్యాంగ రచనకు 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా పార్లమెంటులో జరుగుతున్న చర్చ చివరకు పార్టీల మధ్య బలప్రదర్శనకు, ఘర్షణకు వేదికగా మారింది. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు, ప్రభుత్వం పోటా పోటీ ఆందోళనలు జరుపుతున్నాయి. ఇరు పక్షాలు పార్ల మెంటు లోని మకర ద్వార్ దగ్గర లోపలికి ఒకేసారి వెళ్లేందుకు ప్రయత్నించడం తోపులాటకు దారితీసింది. బీజేపి ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగీ ఈ తోపులాటలో కింద పడిపోవడంతో ఆయన తలకు గాయమైంది.ఎవరో తనను నెట్టేశారని సారంగీ అంటుంటే రాహుల్ గాంధీ నెట్టేశారని బీజేపి నేతలు ఆరోపించారు. రాహుల్ నెట్టేయడం వల్ల తమ ఎంపీలు సారంగీ, ముఖేష్ రాజ్ పుత్ గాయాలపాలయ్యాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు ఆరోపించారు. పార్లమెంటు మకర ద్వారం దగ్గర ఈఘర్షణ జరిగింది. ఇతర ఎంపీలపై ఇలా బలప్రదర్శనకు పాల్పడటం, తోయడం చట్టరీత్యా నేరమని రిజిజు ఆగ్రహించారు. ఇతర ఎంపీలను కొట్టేందుకు కరాటే , కుంగ్ ఫు నేర్చుకున్నారా అని రిజిజు రాహుల్ ని పరోక్షంగా ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ జపానీస్ యుద్ధ విద్యల్లో ఒకటైన ఐకిడో లో బ్లాక్ బెల్ట్ హోల్డర్ కూడా.
మరోవైపు.. ఈ ఆరోపణలను రాహుల్ గాంధీ తోసి పుచ్చారు. మరోవైపు బీజేపి నేతలే తమను తోశారని అందుకే తాము కింద పడిపోయామని అంటున్నారు రాహుల్. తాను లోపలికి వెళుతుంటే.. తనను అడ్డుకున్నారని, మరొకరు తోశారని దాంతో తాను, ఖర్గే నెట్టేసినట్లు అయి తొట్రు పడ్డామని అన్నారు. పార్లమెంటు మకర ద్వార్ అందరూ లోపలికి వెళ్లేందుకు ఉద్దేశించింది. తమను లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడం దారుణం అని రాహుల్ అన్నారు. మరోవైపు ఈ తోపులాటలో తన మోకాళ్లకు గాయమైనట్లు మల్లికార్జున ఖర్గే స్పీకర్ కు లేఖ రాశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com