-
జీవో జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం
-
ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరణ
-
గ్రూప్-ఎలో ఉన్న కులాలకు 1శాతం రిజర్వేషన్
-
గ్రూప్-బిలో ఉన్న కులాలకు 9శాతం రిజర్వేషన్
-
గ్రూప్-సిలో ఉన్న కులాలకు 5శాతం రిజర్వేషన్
తెలంగాణ రాష్ట్రంలో ఎట్టకేలకు ఎస్సీల వర్గీకరణ జీవో విడుదలయ్యింది. ఎస్సీ ఉప కులాలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రిజర్వేషన్ల కల నెరవేరింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఎస్సీలకు రిజర్వేషన్లు అధికారికంగా అమలులోకి రానున్నాయి. మొత్తం 15శాతం రిజర్వేషన్లను ఎస్సీ ఉప కులాలకు కేటాయించింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ గెజిట్‌ను తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో విడుదల చేశారు.
ఎస్సీలలో మొత్తం 59 ఉప కులాలు ఉన్నాయి. ఈ కులాలను 3 గ్రూపులుగా వర్గీకరించారు. ఈ 59 ఉప కులాల్లో సామాజికంగా, విద్యా పరంగా, ఆర్థికంగా 15 కులాలు పూర్తిగా వెనుకబడి ఉన్నాయని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. దీంతో గ్రూప్-ఏలో ఉన్న కులాలకు ఒక్కశాతం రిజర్వేషన్ కేటాయించారు. అలాగే, మధ్యస్థంగా ఇప్పటిదాకా లబ్ది పొందిన ఉప కులాల సంఖ్య 18గా నిర్ధారించారు. ఈ 18 కులాలకు.. గ్రూప్-బి కింద 9శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఇక, ఎస్సీ ఉప కులాల్లో మిగతా వాళ్లతో పోలిస్తే.. గణనీయంగా లబ్ది పొందారని గుర్తించిన 26 ఉప కులాలను గ్రూప్-సిగా వర్గీకరించారు. ఈ గ్రూప్-సి కింద ఉన్న వాళ్లకు 5శాతం రిజర్వేషన్లు కేటాయించారు.
అంబేడ్కర్ జయంతి రోజున తెలంగాణలో ఈ ఎస్సీల రిజర్వేషన్లు అమలులోకి రావడం పట్ల దశాబ్దాలుగా వర్గీకరణను డిమాండ్ చేస్తున్న వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఉదయం ట్యాంక్ బండ్ దగ్గరున్న అంబేడ్కర్ విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఎస్సీల వర్గీలకరణతో మూడు దశాబ్దాల పోరాటం ఆకాంక్షలు నెరవేరుస్తున్నామన్నారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో బడుగులకు రిజర్వేషన్ల కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు. యంగ్ ఇండియా స్కూల్స్ ద్వారా నాణ్యమైన విద్యను అందించే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ఎస్సీల వర్గీకరణ ఉప కులాల వారీగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఎస్సీ ఉపకులాల జాబితా
గ్రూప్-ఎ కులాలు : (1శాతం రిజర్వేషన్)
- బావూరి
- బేడా (బుడగ) జంగం
- చాచటి
- డక్కల్, డక్కల్‌వార్
- జగ్గలి
- కొలుపులవందు, పంబడ, పాంబండ, పంబాల
- మాంగ్
- మాంగ్ గరోడి
- మన్నె
- మస్తి
- మాతంగి
- మెహ్‌తార్
- ముండాల
- సాంబన్
- సాప్రు
గ్రూప్-బి కులాలు : (9శాతం రిజర్వేషన్)
- అరుంధతీయ
- బైండ్ల
- చమార్, మోచి, ముచి, చమార్-రవిదాస్, చమార్-రోహిదాస్
- చంభర్
- చందాల
- దండసి
- డోమ్, డొంబర, పైడి, పనో
- ఎల్లమ్మలవార్, ఎల్లమ్మల వాండ్లు
- గోడరి
- జాంబవులు
- మాదిగ
- మాదిగ దాసు, మస్తీన్
- పామిడి
- పంచమ, పరియ
- సామగారా
- సిందోళ్లు, చిందోళ్లు
- యాటాల
- వల్లువన్
గ్రూప్-సి కులాలు : (5శాతం రిజర్వేషన్)
- ఆది ఆంధ్ర
- ఆది ద్రవిడ
- అనాముక్
- అరయ్ మాల
- అర్వ మాల
- బరికి
- బ్యాగర, బ్యాగరి
- చలవాది
- ధోర్
- ఘసి, హడ్డి, రెల్లి, చంచండి
- గోసంగి
- హోలెయ
- హోలెయ దాసరి
- మాదాసి కురువ, మాదారి కురువ
- మహర్
- మాల, మాల అయ్యవారు
- మాల దాసరి
- మాల దాసు
- మాల హన్నయ్
- మాల జంగం
- మాల మస్తి
- మాల సాలె, నేతకాని
- మాల సన్యాసి
- మిత్త అయ్యల్‌వార్
- పాకి, మోతి, తోటి,
- రెల్లి