26.8 C
Hyderabad
Wednesday, September 16, 2026

Live Video

spot_img

అదంత ఈజీ కాదంటున్న రష్యా..

ఉక్రెయిన్‌తో రష్యా చేస్తున్న యుద్ధం ఎప్పుడు ఆగుతుంది? ఎలా ఆగుతుంది? ఈ ప్రశ్నలకు కుండబద్ధలు కొట్టినట్టు సమాధానం ఇచ్చారు రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్. అదంత ఈజీ కాదన్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగాలంటే చట్టబద్ధమైన ఒప్పందం కుదరాలన్నారు. ఆ ఒప్పందం వల్ల రష్యాతో పాటు పొరుగు దేశాల్లో శాంతి నెలకొనాలని చెప్పారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలాంటి పరిస్థితులు కనిపించడం లేదంటున్నారు ఆయన.

నిజానికి ఉక్రెయిన్‌, రష్యా దాడుల డోస్ పెంచాయి. ఉక్రెయిన్‌ జెలెన్‌ స్కీ రష్యా వారిపై ఎన్ని మిసైల్స్‌తో దాడి చేస్తోంది.. వాటిలో ఎన్ని అడ్డుకుంటున్నాం.. ఎన్ని లక్ష్యాలను చేరాయి.. ఇలా అన్ని విషయాలను మీడియా ముందు పెట్టేస్తున్నారు. కానీ ఉక్రెయిన్ చేసే దాడుల గురించి మాత్రం ఒక్క మాట మాట్లాడటం లేదు. మరోవైపు ఉక్రెయిన్‌కు తాను పదవీ నుంచి దిగిపోయేలోపు వీలైనంత ఆయుధ సాయం చేయాలని డిసైడ్ అయ్యారు అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్. ఇప్పటికే గడచిన నెలలో దాదాపు 3 బిలియన్ డాలర్ల ఆయుధ సాయం అందించిన బైడెన్.. మరోసారి సాయం అందించేందుకు రెడీ అయ్యారు. దీనికి సంబంధించిన చర్చలు కూడా ముగిశాయని ఆయనే ప్రకటించారు.

ఓవైపు అమెరికా ఆయుధ సాయం.. మరోవైపు ఉక్రెయిన్ దాడులు.. దీంతో రష్యా కూడా గట్టిగానే స్పందిస్తోంది. పైకి గంభీంగా కనిపిస్తూ.. రష్యాపై తమ పోరాటం ఇది అంటూ అనేక వీడియోలు రిలీజ్ చేస్తున్న ఇప్పటికీ ఈ యుద్ధంలో పైచేయి రష్యాదే అన్నది నిజం. ఎందుకంటే ఇప్పటికే ఉక్రెయిన్ చాలా భూభాగాన్ని కొల్పోయింది. ఒకవేళ ఉక్రెయిన్‌ ఇప్పుడు శాంతి ఒప్పందం చేసుకుందామనుకున్నా బైడెన్ సర్కార్ అంగీకరించే పరిస్థితి లేదు. అందుకే రష్యా ఓపేన్‌గానే ఇప్పుడు శాంతి ఒప్పందం సాధ్యం కాదని తేల్చి చెబుతోంది.

ఒప్పందం ఎప్పుడు జరిగినా తమ డిమాండ్ ఒక్కటే అంటోంది రష్యా. ఉక్రెయిన్ ఎప్పటికీ నాటోలో చేరకూడదు. ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉన్న భూభాగాలు ఆ దేశానికే చెందాలి. కానీ ఈ రెండు డిమాండ్లకు ఉక్రెయిన్ నో చెబుతోంది. అందుకే యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ట్రంప్ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాతే ఈ యుద్ధం మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com