28.2 C
Hyderabad
Wednesday, September 16, 2026

Live Video

spot_img

సైలెంట్‌గా పనికానిచ్చేస్తున్న రష్యా..

రష్యా మరోసారి విరుచుకుపడింది ఉక్రెయిన్‌పై. రాజధాని కీవ్‌తో సహా అనేక ప్రాంతాలపై మిసైల్స్‌తో దాడులకు దిగింది. క్రూయిజ్‌ క్షిపణులు, ఎయిర్‌ఫోర్స్‌ డ్రోన్‌లతో కీవ్‌పై మాస్కో దాడులు నిర్వహించింది. ఈసారి పవర్‌గ్రిడ్‌లను టార్గెట్ చేసుకొని దాడులు చేసింది. ఈ దాడులపై రష్యా ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాత్రం తమపై దాడులు జరిగాయని ప్రకటించారు. రష్యా మొత్తం 93 మిసైల్స్.. 200 డ్రోన్స్‌ను ప్రయోగించారని తెలిపింది. అయితే 81 మిసైల్స్‌ను కూల్చేశామని తెలిపారు.

కానీ రష్యా మాత్రం చాలా పక్కగా దాడులు చేస్తూ పోతుంది. ముఖ్యంగా పవర్‌ గ్రిడ్‌లను టార్గెట్ చేసుకొని దాడులు చేస్తుంది. వింటర్‌కు ముందు ఈ దాడులు చేయడం ఉక్రెయిన్‌ వాసులకు అస్సలు మంచిది కాదనే చెప్పాలి. ఎందుకంటే ఉక్రెయిన్‌లోని అనేక ప్రాంతాల్లో జీరో డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇలాంటి సమయంలో వారికి ఎలక్ట్రిసిటీ లేకపోతే వారి పరిస్థితి దారుణంగా మారుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు.

అయితే ట్రంప్ అధ్యక్షుడిగా ఏదో ఒకటి తేల్చేయాలని అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ పట్టుదలగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బిలియన్ డాలర్ల కొద్ది నిధులు, ఆయుధాలు అందిస్తున్నారు. మరోవైపు రష్యా కూడా ఈ సమయంలోనే వీలైనన్ని దాడులు చేయాలని చూస్తోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com