స్వాతంత్ర సమరయోధులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అంబటి వీరయ్య మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చేరుకొని పితృ వియోగం పొందిన కాంగ్రెస్ పార్టీ చింతకాని మండల అధ్యక్షులు అంబటి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. స్వాతంత్ర సమరయోధులు స్వర్గీయ అంబటి వీరయ్య చిత్రపటం వద్ద పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులు అర్పించారు. వీరయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. స్వాతంత్ర పోరాటంలో ఆయన చేసిన త్యాగాలను సేవలను ఈ సందర్భంగా భట్టి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.