24 C
Hyderabad
Monday, August 24, 2026

Live Video

spot_img

పుష్ప ఇంటి వద్ద కేన్స్ ను మించిన కోలాహలం

అల్లు అర్జున్ ఇంటి వద్ద మీడియా సందోహం చూస్తుంటే…. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ను మించిపోయినట్టుగా కనిపిస్తోంది. పుష్ప ప్రెస్ మీట్ కవర్ చేసేందుకు తెలుగు మీడియాతో పాటు జాతీయ మీడియా ఇతర ప్రాంతీయ భాషల మీడియా ప్రతినిధులు చేరుకున్నారు.  సుమారు 60 మీడియా సంస్థల నుంచి వచ్చినట్టు సమాచారం.

బన్నీని పరామర్శించేందుకు సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ మేనల్లుడిని చూసి భావోద్వేగానికి లోనయ్యారు. హీరో నాగచైతన్య,శ్రీకాంత్, సురేష్ బాబు,  డైరెక్టర్ సుకుమార్, రాఘవేంద్రరావు, హరీష్ శంకర్ తదితరలు వచ్చారు.

అల్లు అర్జున్ విడుదల తర్వాత మీడియా సమావేశం నిర్వహించటం ప్రాధాన్యత సంతరించుకుంది. పుష్ప అరెస్టు దగ్గర నుంచి విడుదల వరకు శుక్రవారం జరిగిన పరిణామాలపై పలు విధాలుగా చర్చ జరుగుతోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com