35.2 C
Hyderabad
Friday, May 22, 2026

Live Video

spot_img

వేవ్స్‌ సమ్మిట్‌లో ఒటిటి డెవలప్‌మెంట్‌పై రౌండ్‌టేబుల్‌ మీటింగ్‌

ముంబయిలో జరిగిన ‘వేవ్స్ సమ్మిట్ 2025’లో భాగంగా కీలక సెషన్‌లు నిర్వహించారు. వీటిలో భాగంగానే ‘ఒటిటి & డిజిటల్ ఆధారిత కంటెంట్’ అంశంపై రౌండ్‌ టేబుల్ సమావేశం జరిగింది. భారత దేశ ఓటీటీ రంగం గ్లోబల్ మార్కెట్ల దిశగా దూసుకెళ్లే లక్ష్యాలను ఈ రౌండ్‌ టేబుల్ మీటింగ్‌లో ప్రకటించారు. ఈ సమావేశంలో ప్రైమస్ పార్ట్నర్స్, ఎడబ్ల్యూఎస్‌, రోలింగ్ స్టోన్ ఇండియా సంయుక్తంగా రూపొందించిన “ప్రెస్ ప్లే – ఇండియాస్ ఓటీటీ స్టోరీ గోస్ గ్లోబల్” అనే పేరుతో రూపొందించిన నివేదికను మహారాష్ట్ర మంత్రి ఆశీష్ షెలార్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠీ ఓటీటీని ప్రారంభించబోతోందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, క్రియేటర్‌ ల్యాండ్‌ అనే అంతర్జాతీయ సంస్థల మధ్య ఎంఓయూ కుదిరింది. ఏపీలో ట్రాన్స్‌మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ సిటీని ఏర్పాటు చేయనున్నట్టు కీలక ప్రకటన చేశారు. ఈ రౌండ్‌ టేబుల్‌ మీటింగ్‌లో అమల అక్కినేని, సచిన్ పిల్గావంకర్, గౌరవ్ ద్వివేది, డేవిడ్ ఉంగర్ తదితరులు పాల్గొన్నారు. భారత ఓటీటీ రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ఇది కీలకమైన వేదికగా నిలిచింది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com