డొమినికన్ రిపబ్లిక్‌లో రూఫ్ టాప్ కూలిన ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే మృతుల సంఖ్య రెండు వందలకు చేరువైంది. రాజధాని శాంటో డొమింగోలో ఉన్న జెట్ సెట్ నైట్‌క్లబ్‌లో పార్టీ జరుగుతుండగా రూఫ్‌టాప్ కుప్పకూలింది. ఈ ప్రమాదం జరిగిన 48 గంటలైంది. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. గంట గంటకు మృతుల సంఖ్య కొనసాగుతూనేంది. ప్రమాద సమయంలో క్లబ్‌లో వెయ్యి మంది వరకు ఉండటంతో డెత్ టోల్ ఎక్కువగా ఉంది.
ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిలో లోకల్ సెలబ్రెటీలతో పాటు స్థానిక నేతలు, బేస్ బాల్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. డొమినికన్ రిపబ్లిక్ ఫేమస్ సింగర్ రూబీ పెరెజ్ కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డాడు. అతడి షోను చూసేందుకే వందలాది మంది వచ్చారు. జెట్‌సెట్ నైట్‌క్లబ్ సీటింగ్ కెపాసిటీ 700 అని అధికారులు తెలిపారు. అదే స్టాండింగ్ అయితే 1000 మంది.
నైట్ క్లబ్ ప్రమాదంపై ఆ దేశ అధ్యక్షుడు లూయిస్ స్పందించారు. ఇలాంటి విషాదం జరగడం బాధాకరణమన్నారు. అయితే ఈ ప్రమాదం జరిగడానికి కారణాలపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. భవనం శిథిలావస్థకు వచ్చిందా? లేక మరేదైనా కారణమా? అనేది ఇంకా తేలాల్సి ఉంది. ప్రస్తుతం శిథిలాలను తొలగించడంపై అధికారులు ఫోకస్ చేశారు.