అమెరికా అధ్యక్షుడు రోజుకో సెన్సెషన్ స్టేట్‌మెంట్‌తో ప్రపంచ వాణిజ్యంతో ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇప్పటికే అన్ని దేశాలపై టారిఫ్‌లు విధించి ప్రపంచవ్యాప్తంగా ఓ అలజడి సృష్టించిన ట్రంప్.. ఇప్పుడు మరో నిర్ణయం తీసుకొని అందరిని షాక్‌కు గురి చేశాడు. తాను విధించిన టారిఫ్‌ల అమలును 90 రోజుల పాటు నిలిపివేశారు. దీంతో టారిఫ్‌ల పోటు తప్పింది.
కానీ చైనా విషయంలో మాత్రం అస్సలు వెనక్కి తగ్గలేదు. చైనాపై టారిఫ్‌లు కొనసాగుతాయని.. ఇప్పటి వరకు విధించిన 104 శాతం కాకుండా.. ఏకంగా 125 శాతం టారిఫ్‌లు అమలవుతాయని ఓ బాంబు పేల్చారు. తమపై రివర్స్ టారిఫ్ వేసినందుకే ఈ నిర్ణయం అని అమలు చేశారు.
ఈ నిర్ణయంతో ట్రంప్ ఓ విషయాన్ని ప్రపంచ దేశాలకు చెప్పకనే చెప్పారు. అన్ని దేశాలు అమెరికా కంట్రోల్‌లో ఉండాల్సిందే.. లేదంటే టారఫ్ పోటు తప్పదంటున్నారు ట్రంప్. దీనికి ససేమీరా అంటోంది చైనా. మరి 90 రోజుల తర్వాత ఈ నిర్ణయాన్ని అమలు చేస్తారా? లేదా? అనేది అప్పటి వరకు చూడాలి. అప్పటి వరకు అన్ని దేశాలు అమెరికా కంట్రోల్‌లో ఉండాలి.. లేదంటే మళ్లీ టారిఫ్ వెపన్‌ను బయటికి తీస్తారన్నమాట ట్రంప్.
ట్రంప్ భయపడ్డాడా?
నిజానికి అమెరికాను మళ్లీ సంపన్న దేశంగా చేస్తానని శపథం చేసి సంచలన నిర్ణయాలు తీసుకున్న ట్రంప్.. ఒక్కసారిగా యూటర్న్ ఎందుకు తీసుకున్నారు? ఈ ప్రశ్నకు ఆయన భయపడ్డాడన్న ప్రచారం కూడా ఉంది. ఎందుకంటే ట్రంప్ విధించిన టారిఫ్‌లు అమలైతే ప్రపంచవ్యాప్తంగా మాంద్యం తప్పదు. ఇప్పటికే అమెరికాలో సంపన్నుల సంపద ఆవిరవుతూ వస్తోంది. ఒక్కరోజులోనే వందల బిలియన్ డాలర్లు నష్టపోయాయి అమెరికన్ టాప్ కంపెనీలు. దీనికి తోడు ఆర్థిక నిపుణులు అమెరికాలో మళ్లీ మాంద్యం తప్పదని హెచ్చరించారు. దీంతో ట్రంప్ దిగిరాక తప్పలేదని తెలుస్తోంది. అంతేకాదు అమెరికాకు వ్యతిరేకంగా అన్ని దేశాలు ఏకమైతే.. అది అసలుకే మోసమని కూడా గమనించి ఉంటారు ట్రంప్. చైనాపై కూడా తగ్గిస్తే పరువు పోతుందనుకున్నారేమో తన ప్రతాపాన్ని చైనాపై చూపించి.. మిగతా విషయాల్లో తోక ముడిచారు.
ఈ మొత్తం ఎపిసోడ్‌తో ట్రంప్‌కు ఒక విషయం మాత్రం అర్థమై ఉంటుంది. అమెరికా ఏ మాత్రం ప్రపంచాన్ని శాసించే సీన్ లేదని. అన్ని దేశాలకు అమెరికాకు ఎంత అవసరం ఉందో.. వారికి కూడా ఇతర దేశాల అవసరం అంతే ఉందని తెలుసుకున్నట్టుంది అమెరికా.