26.1 C
Hyderabad
Thursday, August 6, 2026

Live Video

spot_img

రోహిత్‌ శర్మ అవుట్.. ఆఖరి టెస్ట్‌కు కెప్టెన్‌గా బుమ్రా

శుక్రవారం నుంచి సిడ్నీ వేదికగా జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని ఆఖరి టెస్ట్‌లో భారీ మార్పులు ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఫామ్ కోల్పోయి.. కెప్టెన్సీ కూడా సరిగా నిర్వహించడం లేదంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న రోహిత్‌ శర్మ ఆడటంపై అనేక అనుమానాలు ఉన్నాయి. మొదటి టెస్ట్‌లాగానే.. ఆఖరి టెస్ట్‌కు కూడా బుమ్రా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

రోహిత్ శర్మ చివరి మ్యాచ్ ఆడతాడా? లేదా? అనే ప్రశ్నకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు అనుమానాలను మరింత పెంచేసింది. పిచ్‌ను పరిశీలించాక ఫైనల్‌ టీమ్‌ను అనౌన్స్‌ చేస్తామని చెప్పాడు గంభీర్. అందుకే రోహిత్ ఆడటంపై అనేక అనుమానాలున్నాయి.

ఒకవేళ మ్యాచ్‌ నుంచి రోహిత్ తప్పుకుంటే మరోసారి టీమిండియా పగ్గాలు చేపట్టనున్నాడు… టీమిండియా పేస్ అటాక్‌ను ముందుండి నడిపిస్తున్న జస్ప్రీత్ బుమ్రా. ఈక్వేషన్‌ నుంచి రోహిత్‌ తప్పుకుంటే టీమిండియాలో చాలా మార్పులు రావడం ఖాయం. ముఖ్యంగా ఓపెనర్లుగా మరోసారి కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించనున్నారు. మెల్‌బోర్న్‌ టెస్ట్‌లో మిడిల్‌ ఆర్డర్‌లో రావాల్సిన రోహిత్ శర్మ.. ఓపెనర్‌గా రావడంతో రాహుల్ మూడో స్థానంలో వచ్చాడు. ఇప్పుడా చాన్స్ కనిపించడం లేదు. ఇక రోహిత్‌ టీమ్‌ నుంచి ఔట్‌ అయితే.. శుభ్‌మన్‌ గిల్‌ టీమ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం. మూడో స్థానంలో గిల్‌ ఆడేందుకు వస్తాడని తెలుస్తోంది. గిల్ తర్వాతి స్థానంలో కోహ్లీ గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.

గిల్‌ మాత్రమే కాదు ప్రసిద్ కృష్ణ కూడా టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆకాశ్‌ దీప్‌ గాయం కారణంగా ఇబ్బంది పడుతున్నాడు. అతని స్థానంలోనే ప్రసిద్ కృష్ణ ఆడనున్నట్టు సమాచారం. అయితే ఈ స్థానానికి హర్షిత్‌ రాణాను కూడా సెలెక్ట్ చేసే అవకాశాలున్నాయి.

ఇప్పటికే టీమిండియా పీకల్లోతూ కష్టాల్లో ఉంది. సిడ్నీ టెస్ట్‌లో గెలవకపోతే టీమిండియా WTC ఫైనల్స్‌పై ఆశలు వదులుకోవడమే కాదు.. పరువు కూడా పొగొట్టుకోనుంది

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com