టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సీరియస్.. ఆటగాళ్లకు వార్నింగ్.. డ్రెస్సింగ్ రూమ్ విషయాలు బయటికి రావడం.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటికే పీకల్లోతూ కష్టాల్లో ఉన్న టీమిండియాకు ఇప్పుడీ కొత్త తలనొప్పి కంటిన్యూ అవుతుంది. అయితే ఇప్పుడీ వివాదం మరింత పెద్దదవుతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే సిడ్నీ టెస్ట్‌లో రోహిత్ ఆడతాడా? లేదా? అనే కొత్త అనుమానాలు తెరపైకి వచ్చాయి.
సిడ్ని టెస్ట్‌లో రోహిత్ శర్మ ఆడతాడా? లేదా? అని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను అడిగితే.. సరైన సమాధానం ఇవ్వలేదు. పిచ్ చూశాకా.. మ్యాచ్ టైమ్‌కు టీమ్‌ను ప్రకటిస్తామన్నారు. దీంతో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. నిజానికి గంభీర్ సమాధానం చెప్పిన తీరు టీమిండియాలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయనే వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయనే చెప్పాలి.
నిజానికి ఇప్పుడు రోహిత్ ఆడకపోతే అది గంభీర్ తీసుకున్న నిర్ణయంగానే అందరూ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఫామ్ కోల్పోవడం.. వరుస ఓటములు వీటన్నింటితో సతమతమవుతున్నాడు రోహిత్. ఇలాంటి సమయంలో గంభీర్ ఇచ్చిన స్టేట్మెంట్ అంత ఆశాజనకంగా లేదనే చెప్పాలి.
ఇప్పుడు కెప్టెన్ ఫైనల్ మ్యాచ్‌లో ఆడతాడా? లేదా? అనేది తేలాలంటే మ్యాచ్ ప్రారంభమయ్యే వరకు ఆగాల్సిందే.
అంతేకాదు డ్రెస్సింగ్ రూమ్ పంచాయితీపై కూడా ఓపెన్ అయ్యాడు గంభీర్. అక్కడ తామ నిజాయితీగా చర్చించుకుంటామని.. పర్ఫామెన్స్ గురించి తప్ప మరో విషయంపై అక్కడ చర్చ ఉండదని.. అలాంటి విషయాలు బయటికి రాకపోతేనే మంచిదన్నాడు.