ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి మూకలు రెచ్చిపోతున్నాయి. గంజాయిని అక్రమంగా తరలించడానిక ఎంతకైనా తెగిస్తోంది గంజాయి మాఫియా. ఇంతకాలం తమ అక్రమ రవాణాకుఅడ్డు వచ్చే సామాన్యులపై విచక్షణా రహితంగా దాడులకు పాల్పడే గంజాయి మాఫియా తాజాగా పోలీసులపై కూడా తమ ప్రతాపం చూపించడం ప్రారంభించింది. తాజాగా ఒక కానిస్టేబుల్ పై వాహనంతో దూసుకు వెళ్లిన గంజాయి ముఠా సీసీ ఫుటేజ్ ఒకటి వెలుగు చూసింది. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద ఈ సంఘటన జరిగింది. డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్ళ పైకి కారును పోనిచ్చారు గంజాయి తరలిస్తున్న దుండగులు. భారీగా గంజాయి లోడుతో కిర్లంపూడి వైపు ఒక వాహనం వస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం రావడంతో పదుల సంఖ్యలో పోలీసులు కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఒక వైట్ కలర్ ఎస్యూవీ వాహనాన్ని ఆపి తనిఖీలు నిర్వహిస్తుండగా ఆ వాహనదారుడు ఎదురగా కారును అడ్డుకున్న పోలీసుల పైకి ఎక్కించి వేగంగా తోలుకుంటూ పరారయ్యాడు. ఈ ఘటనలో ఇక కానిస్టేబుల్ కు తీవ్ర గయాలు కాగా మరో కానిస్టేబుల్ కి స్వల్పగాయాలు అయ్యాయి. గంజాయి ముఠా చర్యతో షాక్ తిన్న పోలీసులు దుండగులను పట్టుకునే పనిలో పడ్డారు.
- Advertisement with us -