28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

క్రిస్మస్ కు రాబిన్‌హుడ్

హీరో నితిన్ మచ్-అవైటెడ్ హీస్ట్ కామెడీ రాబిన్‌హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హై బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీస్ జోరుగా జరుగుతున్నాయి. టీజర్, ఫస్ట్ సింగిల్- వన్ మోర్ టైమ్‌ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ డిసెంబర్ 25న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా టీం ఫస్ట్ కనెక్ట్ ప్రెస్ మీట్ ని నిర్వహించింది.

ఫస్ట్ కనెక్ట్ ప్రెస్ మీట్ లో హీరో నితిన్ మాట్లాడుతూ.. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్ కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నా కెరియర్ లోనే ఇది హయ్యస్ట్ బడ్జెట్ సినిమా. ఒక విషయం కాన్ఫిడెంట్ గా చెబుతున్నా. డిసెంబర్ 25 నాడు రాబిన్‌హుడ్ నిర్మాతలు పెట్టిన డబ్బుని రెంట్టింపుతో సహా మీనుంచి దోచుకొని వారికి ఇస్తాడు. ఈ క్రిస్మస్ మాదే. థాంక్ యూ’ అన్నారు.

క్రిస్మస్ హాలిడేస్ కి ఒక సెలబ్రేషన్ లా ఉండాలని డిసెంబర్ 25న ఈ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నామని దర్శక నిర్మాతలు వెల్లడించారు. డెఫినెట్ గా ఇది చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ అవుతుంది. అందరికీ నచ్చుతుందన్నారు

నటీనటులు: నితిన్, శ్రీలీల, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com