బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి కెరీర్ లో స్థిరపడే సమయంలో ఆటుపోట్లు ఎదుర్కొంది. వర్దమాన హీరో సుశాంతి సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో జైలుపక్షిగా మారి అనేక కష్టనష్టాలను ఎదుర్కొన్న రియాకు ఇటీవలే ఊరట లభించింది. న్యాయస్థానం ఆమెకు క్లీన్ చీట్ ఇచ్చింది.బెంగాలీ కుటుంబానికి చెందిన రియా చక్రవర్తి 1992లొ జన్మించింది. తండ్రి ఆర్మీ అధికారి కావడంతో బెంగళూరు, చండీఘడ్, ఢిల్లీ, ముంబై తదితర దేశంలోని ముఖ్యనగరాలన్నీ చుట్టేసింది.
మొదట మోడలింగ్ తో ప్రారంభించిన రియా 1992లో MTV వీజేగా కెరీర్ మొదలుపెట్టి వెండితెరపై దృష్టి సారించింది
2012లో తూనీగా తూనీగా తెలుగు సినిమాతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ సినిమా తర్వాత తెలుగులో చేయలేదు.
2012 నుంచి 2018 వరకు వరుసగా సినిమాలు చేసిన రియా…స్టార్ గా స్థిరపడే సమయంలో తుపాను చుట్టుముట్టింది.
2019లో హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో ప్రేమాయణం కొనసాగించిన అమ్మడు…కొద్దిరోజులు ఎంజాయ్ చేసింది
ఒక్క ఏడాదిలోనే రియా జీవితం మారిపోయింది. 2020 జూన్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుట్ ఆత్మహత్యతో రియాపై కేసు నమోదైంది.
సుశాంత్ సింగ్ కు డ్రగ్స్ సరఫరా చేసిందనే ఆరోపణలతో 27 రోజులు జైలుకు వెళ్లింది. మీడియా సూటిపోటి ప్రశ్నలతో ఆత్మహత్య వరకు వెళ్లింది.
మల్లెతీగలా ఉండే రియా సుశాంత్ వ్యవహారంతో డిస్టర్బ్ అయింది. ఇప్పుడు సినిమాలు లేకపోయినా MTVలో రోడీస్ కార్యక్రమం చేస్తోంది.
courtesy : instagram