25.2 C
Hyderabad
Monday, July 27, 2026

Live Video

spot_img

అబ్బే మేమేం పార్టీ మారలా… మా పార్టీలోనే ఉన్నాం…

  • ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ
  • కోర్టుకు తమ అభిప్రాయాన్ని తెలపనున్న స్పీకర్
  • పదిమంది ఫిరాయింపు శాసనసభ్యులు కూడా
  • ఫిరాయించలేదని అఫిడవిట్ దాఖలు చేసిన నలుగురు ఎమ్మెల్యేలు
  • ఉప ఎన్నికలు రాకుండా జాగ్రత్తలు

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం కీలక దశకు చేరుకుంది. ఈ కేసుకు సంబంధించిన విచారణ మంగళవారం సుప్రీంకోర్టులో జరగనుంది. తెలంగాణలో పదిమంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇప్పటికే స్పీకర్ కి కూడా నోటీసులు ఇచ్చింది. పదిమంది ఎమ్మెల్యేలు, స్పీకర్ మంగళవారం సుప్రీంకోర్టులో ఏ విధంగా స్పందిస్తారన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

అయితే మంగళవారం కోర్టులో విచారణకు ముందే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేలలో నలుగురు ఎమ్మెల్యేలు తాము పార్టీ ఫిరాయించలేదని తాము గెలిచిన బీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఉన్నామని సుప్రీంకోర్టులో ఇప్పటికే అఫిడవిట్‌ దాఖలు చేసినట్లు సమాచారం. కేవలం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసామని అంతకుమించి తాము కాంగ్రెస్  పార్టీలో చేరినట్లుగా జరుగుతున్న ప్రచారం నిరాధారమని ఆ నలుగురు  ఎమ్మెల్యేలు తమ అఫిడవిట్లో ఖండింపేర్కొన్నట్లు సమాచారం.

తాము పార్టీ మారలేదని సుప్రీంకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేసిన ఫిరాయింపు శాసనసభ్యుల్లో మహిపాల్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, డాక్టర్ సంజయ్, కాలే యాదయ్య లు ఉన్నట్లు సమాచారం. మంగళవారం విచారణ సందర్భంగా ఈ ఎమ్మెల్యేల వ్యవహారం అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఇప్పటికిప్పుడు ఫిర్యాంపు ఎమ్మెల్యేలకు సంబంధించి కోర్టు ఆదేశాలు జారీ చేసే అవకాశం కనిపించడం లేదని నిపుణులు అంటున్నారు. గతంలో కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర లో ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం చాలా కాలం పాటు సుప్రీంకోర్టులో నడిచింది. అయితే టిఆర్ఎస్ మాత్రం ఈ పదిమంది ఎమ్మెల్యేలు విషయంలో తమ వాదనను బలంగా వినిపించేందుకు సిద్ధమవుతుంది. సుప్రీం కోర్టులో తమ వాదనలు బలంగా వినిపించడం ద్వారా ఫిరాయింపు శాసనసభ్యుల చేతే తాము పార్టీ మారలేదని, బీఆర్‌ఎస్‌ లోనే ఉన్నామని చెప్పేంచే విధంగా ఒత్తిడి తేవాలని ఆ పార్టీ వ్యూహంగా తెలుస్తోంది.

మరో వైపు ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు రావాలని కోరుకోవడం లేదు. ఉప ఎన్నికలు వస్తే లేనిపోని సమస్యలు వస్తాయి గనుక అవి రాకుండా న్యాయపరంగా ఏ రకంగా ముందుకు వెళ్లాలని అంశంపైనే వాళ్ళు దృష్టి సారించారు. పదిమందిలో నలుగురు మాత్రమే ప్రస్తుతానికి తాము చేరలేదని అధికారికంగా సుప్రీంకోర్టులో అఫిడబిట్ దాఖలు చేసినట్లుగా తెలిసింది. మిగిలిన ఆరుగురు శాసనసభ్యులు కూడా మధ్యేమార్గంగానే వ్యవహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇక ఈ అంశంపై స్పీకర్ ఏ విధంగా స్పందిస్తానని విషయం ఆసక్తికరంగా మారింది. మంగళవారం సుప్రీంకోర్టులో స్పీకర్ తన వైఖరిని వెల్లడించనున్నారు. మొత్తం మీద ఫిరాయింపు వ్యవహారం కీలక దశకు  చేరుకుంటున్న నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేలు మాత్రం న్యాయపరంగా ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. సాంకేతికంగా చూస్తే మేము ఇప్పటికీ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలమే అని వాళ్ళు వాదిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మంగళవారం సుప్రీంకోర్టులో జరిగే వాదనలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com