-
కంచ గచ్చిబౌలి భూమిపై ప్రభుత్వం, హెచ్‌సీయూ మధ్య వివాదం
-
అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం రేవంత్ చర్చలు
-
నిరసనలు, ఆందోళనలపై ఆరా తీసిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి ప్రాంతంలో వివాదాస్పదంగా మారిన 400 ఎకరాల భూముల వ్యవహారంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం నిర్వహించారు. మంత్రులతో తాజా పరిణామాలపై ర్చించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలో ఉన్న సుమారు 400 ఎకరాల భూములను పరిరక్షించాలంటూ గత కొద్ది రోజులుగా విపక్షాలు, విద్యార్థి సంఘాలు, హెచ్‌సీయూ విద్యార్థులు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం రేవంత్ మంత్రులతో సమావేశమయ్యారు.
సీఎం నిర్వహించిన ఈ రివ్యూకు అందుబాటులో ఉన్న మంత్రులు హాజరయ్యారు. ప్రస్తుత పరిస్థితుల గురించి మంత్రుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.