అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరైంది. 50 వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాక విడుదల చేయాలంటూ తెలంగాణ హై కోర్టు తీర్పు నిచ్చింది. అంతకుముందు ఇరు వర్గాల మధ్య తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి. అల్లు అర్జున్ అరెస్టుపై అటు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్కు తరలించాలని ఆదేశించింది.అయితే మధ్యంతర బెయిల్ కోసం తెలంగాణ హై కోర్టును ఆశ్రయించారు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు.. తెలంగాణ హై కోర్టులోనూ ఈ కేసుపై తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. అర్నబ్ గోస్వామి కేసు లో తీర్పును, గుజరాత్ వర్సెస్ షారూఖ్ ఖాన్ కేసు తీర్పును ఊటంకిస్తూ అల్లు అర్జున్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.ఎట్టకేలకు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హై కోర్టు తీర్పు నిచ్చింది.
ఇది ఫ్యాన్స్ విజయం
కోర్టుతీర్పు నేపధ్యంలో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది ఫ్యాన్స్ సాధించిన విజయమని అన్నారు. న్యాయవ్యవస్థ పై నమ్మకం ఫలించిందని, తమ కేసులో తమకు న్యాయం జరిగిందని ఆయనన్నారు.