26.9 C
Hyderabad
Saturday, June 13, 2026

Live Video

spot_img

క్యాబినేట్ విస్తరణకు చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్న కాంగీయులు

చాలా రోజుల నుండి సస్పెన్స్ థ్రిల్లర్ గా కొనసాగుతున్న మంత్రివర్గ విస్త‌ర‌ణ చివరి దశకు వచ్చిందా… అన్ని అంశాల్లో నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ నేతలకే హై కమాండ్ స్వేచ్చను ఇచ్చిందా? మంత్రి మండలి కూర్పుకు స‌మీక‌ర‌ణాలు కుదిరాయా? మంత్రి పదవి రేసులో ఉన్నదెవరు?

చాల రోజులుగా వాయిదా ప‌డుతూ వ‌స్తున్న తెలంగాణ కేబినెట్ విస్త‌ర‌ణకు ముహూర్తం ఖ‌రారు ఎప్పుడు అవుతుంది అనే విషయం పార్టీలో చర్చ జరుగుతుంది. అయితే ప్రతిసారి త్వరలోనే  మంత్రి మండలి విస్తరణ,  కార్పొరేషన్ పదవుల భర్తీ, పార్టీ పదవుల పంపకం ఇలా అన్ని పదవులపై క్లారిటీ వస్తుందని ముఖ్య నేతలు అంటున్నారు.. అన్ని అంశాల్లో రాష్ట్ర నేతలకే పూర్తి స్వేచ్చ ఇవ్వాలని హై కమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇటీవల ఏడాది పూర్తయింది ఈ సందర్భంగా భారీ ఎత్తున విజువల్స్ కూడా నిర్వహించారు … కీలక శాఖలకు మంత్రులు లేరన్న విమర్శలు కూడా పెరుగుతుంది మధ్యలో సాధ్యమైనంత త్వరగా దీనిని పూర్తిచేయాలని ఆలోచనలో రాష్ట్ర నాయకత్వం ఉన్నప్పటికీ కేంద్ర నాయకత్వం మాత్రం ఆశతో అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది .. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలు ఢిల్లీ పర్యటనలో పార్టీ పెద్దలను కలిసి మంత్రివర్గ విస్తరణ పై కూడా చర్చించినట్లుగా సమాచారం.. కొద్ది రోజుల క్రితం సీఏం రేవంత్ రెడ్డి నివాసంలో భేటి అయిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, పార్టీ ఇంచార్జీ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవుల భర్తీపై తుది కసరత్తు చేశారు. త్వరలోనే 30 కార్పొరేషన్ పదవులు భర్తీ చేస్తామని, మంత్రి వర్గ విస్తరణ చేపడుతామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఇటీవల ప్రకటించారు. జిల్లాలు, సామాజిక స‌మీక‌ర‌ణాలు కుదరకపోవడంతో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌ ఇన్ని రోజులు వాయిదా పడినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఆశావహులకు అన్ని విషయాలు చెప్పి పదవులు ఆశించి భంగపడ్డవారికి భవిష్యత్తులో మంచి అవకాశమిస్తామని భరోసా ఇచ్చినట్లు సమాచారం.

ఇప్పటివరకు మంత్రుల ప్రాతినిధ్యం లేని ఉమ్మ‌డి ఆదిలాబాద్, ఉమ్మ‌డి నిజామాబాద్, హైద‌రాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఒక్కొక్కరికి కేబినెట్ లో బెర్త్ ఖ‌రారు అయిన‌ట్లు సమాచారం. మరోవైపు ఉమ్మ‌డి న‌ల్ల‌గోండ, ఉమ్మ‌డి మెద‌క్ నుంచి ఇద్ద‌రికి బెర్త్  ఖరారు అయిన‌ట్లు సమాచారం. ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రాం మోహన్ రెడ్డి  పేర్లను అధిష్ఠానం పరిశీలించింది. ఈ ఇద్దరిలో ఒకరికి మంత్రి పదవి ఖాయమని సమాచారం. ఇక  ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగ‌ర్ రావు, గ‌డ్డం వివేక్ లలో ఒకరికి మంత్రి పదవి దక్కనుంది. నిజామాబాద్ జిల్లాలో సుద‌ర్శ‌న్ రెడ్డి పేరు దాదాపు ఖ‌రారు అయినట్లు సమాచారం.

ఉమ్మ‌డి న‌ల్లగోండ జిల్లాలో రాజ‌గోపాల్ రెడ్డి, బాలు నాయ‌క్ ల‌లో ఒకరికి బెర్త్  ఖ‌రారు అయినట్లు సమాచారం. గ్రేటర్ పరిధిలో మంత్రి పదవి ఇవ్వాలనే అంశం తెరపైకి వచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ నుండి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిచిన శ్రీ గణేష్ ను మంత్రి మండలిలోకి తీసుకుంటే బాగుంటుందని అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. శ్రీ గణేష్ మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే అయినప్పటికీ నియోజకవర్గంతో పాటు గ్రేటర్ పరిధిలో తన మార్క్ చూపించే కార్యక్రమాలను చేస్తున్నారు. గీతారెడ్డి లాంటి సీనియర్ నాయకుల ఆశీస్సులు ఉన్న శ్రీ గణేష్ పార్టీకి లాయల్ అనే ముద్ర వేయించుకున్నారు. ఇటీవల కంటోన్మెంట్ పరిధిలో కొందరు మత కలహాలు సృష్టించే పని చేయగా దాన్ని చాకచక్యంగా తిప్పి కొట్టడంలో శ్రీ గణేష్ సక్సెస్ అయ్యారు. ఇటీవల సీఏం నివాసంలో జరిగిన భేటీలో ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఉమ్మ‌డి మెద‌క్ జిల్లా నుండి ఒకరికి ఎమ్మెల్సీ ఇవ్వాలని పార్టీ భావిస్తోందట. మెదక్   పార్ల‌మెంట్  నుండి పోటీచేసి ఓడిపోయిన నీలం మధుకి ఈ అవకాశం ఇవ్వాలని పార్టీ ఇంచార్జీ దీపాదాస్ మున్షీ హై కమాండ్ కి రెఫర్ చేసినట్లు హస్తం కీలక నేత తెలిపారు. ఇక  సీఏం ఆశీస్సులు కూడా  నీలం మ‌ధుకు ఉన్న‌ట్లు ప్ర‌చారం నడుస్తోంది. జిల్లా ప్రాతినిధ్యం, సామాజిక స‌మీక‌ర‌ణాల ఈక్వేష‌న్స్ తో నీలం మధుకి మంత్రి ప‌ద‌వి వచ్చే అవకాశం ఉందని హస్తం నేతలు చెబుతున్నారు. మరోవైపు కీలకమైన హోమ్ విద్యా మున్సిపల్ వంటి శాఖలు ముఖ్యమంత్రి వద్దని ప్రస్తుతం ఉన్న ఈ శాఖలకు సంబంధించిన నిర్ణయాల విషయంలో ఆలస్యం జరుగుతుందని వాదన కూడా ఉంది. ఎమ్మెల్యేలుగా ఉన్న నాయకులు మంత్రి బెర్త్ దక్కించుకావాలని ప్రయత్నాలు చేస్తుండగా,  మహారాష్ట్ర ఓటమి తో జాగ్రత్తగా పరిశీలిస్తుందట.. ఇక పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుందో చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com